పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/321

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

24. సన్యాసిరెడ్డి దళం:-

      నాగులాపల్లి. (తూ.గో) వీరు కృష్ణరాయబరం కధకు ప్రసిద్ధి.  తిరుపతి వెంకటకవ్ల రాయబారం  సీమపధ్యాలు, కర్ణసంవాదంపద్యాలు రంగస్థలిలా పాడేసి జనంచేత ఓహో అనిపించుకొనేవారు.  హాస్యగానికిచిలకలు, పిలకలు (ప్లాస్టిక్ వి0 అలంకరించేవారు.

25. సత్తిఆదిరెద్ది దళం:-

    కొంకుదురు.  (తూ.గో.) శ్రీ సత్తిఆదిరెడ్డి కధకులు.  శ్రీకడియం సింహాచలం, శ్రీ కోరుకొండ కృష్ణమూర్తి వంతలు.  వీరు జూనియర్ నాజర్ శిష్యులు. పల్నాటియుద్ధం, బొబ్బిలియుద్ధం కధలు అతని అడుగు జాదల్లో చెప్పేవారు.

26. సాహిత్యకళాసమితి

      కొంకుదురు. (తూ.గో)  ఈ గ్రంధరచయిత కధకుడుగా, శ్రీ కే.తలుపులరావు వ్యాఖ్యాతగా, శ్రీ సత్తి విశ్వనాధరెడ్డి హాస్యంతో రాజమండ్రి, సోమేశ్వరం, వెదురుపాక, కొంకుదురు, రాయవరం, కొప్పవరం వగైరా చోట్ల ఉత్సవాలకు పార్వతీకళ్యాణం, భారతి కధలు చెప్పడం జరిగింది.  "సంజీవరెడ్డి" బుర్రకధ యీ రచయిత స్వయంగావ్రాసి వారిముందు ప్రదర్శించినప్పుడు ఆనందాన్నిపట్టలేక అల్లూరి సత్యనారాయణ రాజుగారు యీ గొంతులో పాపికొండలలోని గోదావరి గలగ్లారావం వినిపిస్తోందని శ్రాఘీంచారు.  అలాగే 'శ్రీ కళా వెంకటారావు ' కధవ్రాసి రాయవరంలో వారి సమక్షంలో చెప్పినప్పుడు వారు పొందిన ఆనందం అద్వితీయం.

27. శేషారత్నం పార్టీ:-

     కొంకుదురు (తూ.గో.) ఇద్ బాలికలదళం.  కుమారి గాడేపల్లి శేషారత్నం కధకురాలు, కుమారి గాడేపల్లి సర్వలక్ష్మి హాస్యం, కుమారి పడాల ఆదిలక్ష్మి వ్యాఖ్యానంతో సుబాస్ చంద్రబ్ ఓస్ కధ చాలా ముచ్చటగా చెప్పేవారు.  కొంకుదురు, రాయవరం, కాకినాడ, కొప్పవరం, పసలపూడి మొదలగు చోట్లచెప్పి ఎన్నో వెండికప్పులు బహుమతిపొందారు.