పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/320

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చెప్పి పేరుగడించారు. వీరిదళంలో హాస్యం వారపల్లి మాణీక్యాలరావు, వ్యాఖ్యాత చుండ్రు సూర్యనారాయణ. వీరికధలు కష్టజీవి, అల్లూరి సీతారామరాజు. మహారధికర్ణ, వీరాభిమన్యు, రుక్మిణీ కళ్యాణం.

19. పార్ధసారధి దళం:-

   గొల్లలమామిడాడ. (తూ.గో.) వీరు భగవద్గీత కధ దేశంలో పలుచోట్ల చెప్పి ప్రఖ్యాతిగన్నారు.  సుప్రసిద్ధ రంగస్థల హాస్యనటుడు గోపీ ఇందులో హాస్యం చెబుతూ జనాల్ని బాగా ఆకట్టుకునేవారు.

20. ర్తేలంగి సూర్యం పార్టీ:-

    అమలాపురం. వీరు సుమారు 200 వరకూ కధలుచెప్పేరు.  రేడియోలో కూడా వీరి కధలూచ్చాయి.

21. అబ్బారావు దళం:-

   మంచిలి. (ప.గో.) వంతలు మార్టేరు బేబి, అత్తిలిపాప,కష్టజీవి,వీరాభిమన్యు, మహారధి కర్ణ వీరు చెప్పేకధలు.

22. పండు దళం:-

     ముమ్మిడివరం  వీరి పేరు పండితారాధ్యుల సత్యనారాయణగారు.  రచయిత.  వీరుకొన్ని కధలలోకధకులుగాను, కొన్నిటిలో వ్యాఖ్యాతగాను, కొన్నిటిలో హాస్యగానిగానూ కూడా పోషించారు.  ఆంధ్రా, తమిళనాడు, బీహారు, ఒరిస్సా, మహారాష్ట్ర, కర్నాటకలలోకధలు చెప్పి మెప్పీంచారు.  బొబ్బిలియుద్ధం, పల్నాటి భారతం, సీతా కళ్యాణం, కర్ణ, అభిమన్య, సీతారామరాజు, చంద్రహాస, నర్తనశాల కధలు చ్వెబుతున్నారు.  వీరికి 'ధక్కీ కింగ్ ' 'హాస్యశ్రీ ; 'బుర్రకధ నాట్యకళా ప్రవీణ ' బిరుదులిచ్చి ప్రజలు సత్కరించారు.  గుంటూరు నాజర్ గారి కధలో హాస్యం చెప్పేరు.

23. మండ సుబ్బిరెడ్డి దళం:-

  మాచవరం (తూ.గో,)  శ్రీ సుబ్బిరెడ్డి కధకులు. శ్రీ అమ్మిరెడ్ది వ్యాఖ్యాత, శ్రీ కట్టా వీరయ్య హాస్యం.  వీరు సీతరామరాజు, కష్టజీవి మొదలగు కధలతో జనాన్ని ఉరూత లూగించేవారు కమ్యునిష్టు పార్టీకి తమ కధలద్వారా నిధులు రాబట్టేవారు.  వీరు మువ్వురూ అత్రేయ రచించిన కప్పలు నాటకంలో గొప్పగా నటించేవారు.