ఈ పుటను అచ్చుదిద్దలేదు
28. వంతం త్యాగరాజు పార్టీ:-
భట్లమగుటూరు (ప.గో.) త్యాగరాజుగారు మంచి కధకులు, మంచి గాయకులు. గానంతో కధ రక్తికట్టించేవారు. వ్యాఖ్యాత శ్రీఆరట్లకట్ల సోమేశ్వరరావు, వీరిది రాజకీయోపన్యాసంలాగుండేది. శ్రీ జోస్యుల రామం హాస్యం, వీరికి 'వికటకవి ' అని బిరుదు.
29. దాసరికృష్ణ బుర్రకధ దళం;-
భీమవరం, కధకులు శ్రీ దాసరి కృష్ణ వ్యాఖ్యాత శ్రీ దాసరి వెంకన్నబాబు. హాస్యం శ్రీ దాసరి శాయిబాబు. వీరు ముగ్గురూ సోదరులే. నాజర్ ప్రశంశలనందుకున్న దళం.
30-. రత్నం బుర్రకధ దళం:-
తణుకు. కధకురాలు శ్రీమతి రత్నం, వ్యాఖ్యానం శ్రీ కే. నాగేశ్వరరావు, హాస్యం శ్రీ వి.నాగేశ్వరరావు, హార్మోనీ, దోలక్ వీరికి సహకారులు. సీతాకళ్యాణం, చంద్రహాస, వీరాభిమన్యకధలు బాగాచెబుతారు.
31. డి. వెంకట్రావు బుర్రకధ దళం:-
భీమవరం. కధ శ్రీ వెంకట్రావు, మంచిగాయకుడు. హాస్యం శ్రీ దాసరి నరసింహమూర్తి, వ్యాఖ్యానం శ్రీలింగమూర్తి. పల్నాటియుద్ధం, బొబ్బిలియుద్ధం వీరికధలు.
32. సింహాచలం బుర్రకధ దళం:-
భీమవరం. రచయిత, కధకులు శ్రీ సింహాచలం హాస్యం శ్రీ వెంకట్రాజు, - వ్యాఖ్యానం శ్రీ చల్లారావు. ఆంధ్రకేసరిబుర్రకధ, అమరజీవ్గి బుర్రకధ ఆంధ్రదేశమంతటా చెప్పేరు. ఆదిలో సింహాచలంగారు 'కన్యక ' జముకులకధచెప్పేవారు. ఎంతొమందికి బుర్రకధల్లో తర్ఫీదుయిచ్చారు.
33. కొమరశ్రీ బుర్రకధ దళం:-=
కాకినాడ. కొమరశ్రీ అసలుపేరు శ్రీ కె.అప్పారావు. వీరు కధకులు. నాజర్ బాణీ, హాస్యం శ్రీ కాశీరాం, వ్యాఖ్యానం శ్రీ కే. కోదండరావు. బొబ్బిలియుద్ధం, పల్నాటియుద్ధం, ఖడ్గతిక్కన, అల్లూరి సీతారామరాజు వంటి కధలు దేశంలో వేలాదిచెప్పారు. శ్రీ నాజర్ చే సింహతలాటం తొడి