పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/316

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మయం జానపదులులేనట్టి దాదాపు హరికధబాణీలే. వీరిపద్మవ్యుహం కధ వినితీరవలసిందే. ఈకధలో సామాన్యప్రజలకు తెలియని ఎన్నోపురాణగాధలు చెబుతుంటే ఎంతో నిశ్శబ్దంగా నోరావలించి వినేవారు. వీరికి గాత్రంఒకవరం. యావత్ భారతదేశంలో 28 సంత్సరాలు కధలుచెప్పే అఖండకీర్త్నార్జించారు.

4. సుంకర కృష్ణమాధవరావు దాళం

వీరిది జి.మేడపాడు.(తూ.గో.) వీరికధ సంగీతపరంగా ఉండేది. నట్టువాంగంఅంతా అచ్యుతరామయ్యగారిలాగే. అనేకచోట్ల బిరుదులందుకున్నారు. ప్రేక్షకుల్ని కదలకుండాచేసేది. భగవద్గీత మొదలగు కధలుచెప్పేవారు. పద్యాలు రంగస్థలిలో పాడినట్లు పాడడం వీరికధలోబి ప్రత్యేకత.

5. జూనియర్ నాజర్ దళం.

రామచంద్రపురం. మంచిస్పురద్రూపి. నృత్యాభినయాలు చాలా సహజంగావుండేవి. ఆపైన ఆపాతమధురమైన మధుర మంజులగానం. సీనియర్ నాజర్ పద్దతిని పూర్తిగా పుణికిపుచ్చుకున్న కళావేత్త. పల్నాటియుద్ధం, బొబ్బిలియుద్ధం కధలు రాష్త్రరాష్త్రేతరాలలో వేలమీదచెప్పి ఎన్నో సన్మానాలు పొందారు. వీరికి హాస్యం ప్రాంతీయంగా హాస్యమణిపూసగా పేరుగాంచిన శ్రీ కట్టావీరయ్య, ప్రేక్సకులపొట్టలు చెక్కలయ్యేటట్టు నవ్వించేవారు. వీరుఎంతోమందిశిష్యుల్ని తయారుచేశారు.

6.నిట్టలాబ్రదర్స్ :-

వీరిదికోనసీమలోఠానేలంక. మువ్వురూపంలోదరువులు, వీరిది నాజర్ మూసకధ. ఇందులో వ్యాఖ్యాతశతృఘ్నరావుగారిపాత్ర ఎక్కువ. కధకుడు పాటలవరకే పరిమితం. హాస్యపాత్రకూడా ఎక్కువసమయాన్నే తీసుకుంటుంది. కధలో ఎలాగోలాగ సందర్బం కలిగించుకుని భారతదేశానికి స్వతంత్రం వచ్చిననాటినుంచీ నిత్యావసరవస్తువులధరలు ఎలాఆకాశానికి అంటుతున్నాయో వగైరా సామాజిక రుగ్మతలు వ్యంగ్యంగా “ఆగస్టుపదిహేను నందాన అది ఎంతో సుదినమ్ము నందాన“ అనుపల్లవితో విమర్శనాత్మకంగా ప్రజల్ని కవ్వించి నవ్వించడంలో యితని ప్రత్యేకత అసామాన్యం. ఈపాటకోసమే వీరి కధ మరలమరల పెడు