పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/315

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

20వ శరాబ్ది పూర్వార్ధంలొ వీరిప్రదర్శనలు సంచలనాత్మకమేగాక కళాత్మకములుకూడా. ఆబాలగోపాలం అద్యంతం ఉత్సుకతతతో వినేవారట. వ్యాఖ్య్హాన వేషం ఏమీలేకుండా మామూలుగానె ఉండేవాడు. ఈ వంతను రాజకీయం అనేవారు. హాస్యగాడుమాత్రం కూచిపూడి భామాకలాపంలో నట్టువాంగం బ్రాహ్మణునిలా వేషంధరించేవాడు. కధకుడు జానపద సినిమాలలో సైనికవేషంలా (ఇంచుమించు జంగంకధలో కధకునిలా) పాగా, మెడలోపూసలు, మోకాళ్లదిగువవరకూగౌను, సురవా, చెవులకు రింగులు, కాళ్ళకుగజ్జెలతో లయానుగుణంగా నృత్య్హం. భావాభినయం, హృద్యంగాచేసేవాడు. ఈ కధకుడు భానుమూర్తి. రాజకీయం పెదపాటి వెంకట్రావు. వీరు కమ్యూనిష్టుపార్టీపరంగా కధలు చెబుతున్నా జనం అది రాజకీయకధగా భవించేవారుకాదు. అంతకళాత్మకంగా ఉండెది.

2. వేపకాయల వెంకట్రావు బుర్రకధదళం.

    కాకినాడ.  భానుమూర్తిదళంలాగే జనాల్ని ఉర్రూతలూగిస్తూ కధ రసావేశపూరితంగా చెప్పేవారు.  వీరు అల్లూరిసీతారామరాజు కధ చెప్పేవారు.  కధకునితో సమ ఉజ్జీలుగా వంతలునడిచిన డళమిది.  హస్యగాడు చెప్పే ముస్లిం తహశీలుదారుగారి "అచ్చా ' కధక్య్ ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేటట్టు నవ్ఫుకొనేవారు.  ఇందులో శ్రీ బళ్ళ మృత్యంజరావు వ్యాఖ్యానం. శ్రీ చెక్కా సూర్యనారాయణ హాస్యం.

3. నిడదవోలు అచ్యుతరామయ్య బుర్రకధదళం.

      రాజమండ్రి. రచయిత. మంచిహార్మోనిష్టుకూడా.  పర్మవ్యూహం, మహారధికర్ణ, సుభాస్ చంద్రబోస్ కధలు విరివిగా చెప్పేవారు.  వీరికి తంబురభుజంమీద నామమాత్ర,మే. ప్రక్కన హార్మోనియం, తబలా, వయొలిం వగైరా ఉపాంగాలు మొత్తంకధలో 5, 6 సర్లు అడుగులు ముందుకూ వెనక్కూ వేయడం తప్పితే నృత్యంలేననట్లే.  అభినయం అంతంతమాత్రం వేషధారణలో పాగా, పాగామీతురాయి ఉండేవి.  రంగులూ రింగులూ లేవు సురవా, సేనాని గౌనులాంటివి మామూలే.  వ్యాఖ్యాతపాత్ర వంతపాడడమేతప్ప వ్యాఖ్యానంకూడా కధకుడేచెప్పడం- హాస్యగానికిమాత్రం కొంతావకాశం ఉండేది.  వీరి వ్యాఖ్యాత వీరి సోదరులే.  హస్యం ప్రఖ్యాత సినీహాస్యనటుడు రాజబాబు.  కధలో వరుసలు ఎక్కువగా శాస్త్రీయ సంగీత