పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/309

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

15. సత్యవతి భాగవతారిణిగారు:-

     తణుకు.  మంగిఎడ్డిగారికుమార్తె.  సీతాకళ్యాణం, హనుమత్ససందేశం,విజయముద్రికగా కధలు చెబుతారు  కధ మధ్యమధ్య సినిమా పాటలుపాడి జనాన్ని రంజింపజెయ్యటంలో దిట్ట.  "బోల్తాకొట్టిందిరే బుల్ బుల్ పిట్ట" అనేసినిమాపాట యీమపడుతుంటే మళ్ళీ మళ్లీ పాడించుకుని చదివింపులతో ముంచేవారు.
   ఇవి హరికధారంగంలో గోదావరిసీమ ప్రసవించినమరుమల్లెలు.  తూర్పుగొదావరిజిల్లా కపిలేశ్వరపురంలోని శ్రీసర్యారాయ హరికధా గురుకులం ఎంతోమంది యువకళాలరులను తయారుచేసి దేశానికి అందిస్తోంది.  అందులో ప్రభవించిన తొలికుసుమం కుమారిదాలినవర్తి ఉమామహేశ్వరి, ఈమె కుమారసంబవం హరికధన్ సంస్కృతంలో ఊజ్జయినీలోనూ కొలాలంపూర్ లోనూ, పాట్నాలోనూ, మద్రాసులోకూడాచెప్పే పండిత ప్రకాండులను మెప్పించి దేశప్రజలను ఆశ్చర్యచకితుల్ని చేసింది.  ఈ రంగం నీరసపడిపోతున్నరోజుల్లో కపిలేశ్వరపురంలో శ్రీ యస్. బి.పి.కె. సత్యనారాయనరావుగారు వారిసతీమణి రాజేశ్వరమ్మ గారు దీనికొక గురుకులాన్ని స్థాపించి పెంచిపోషిస్తూ నారాయణదాసుగారి పేర అప్పుడప్పుడు హరికధోత్సవాలుకూడా నిర్వహిస్తూ హరికధాజ్యోతి ఆరిపోకుండా కొడిగట్టినదీపానికి చమురుపోసి వెలిగిస్తున్నారు.
   అలాగే రాజమండ్రిలో శ్రీ త్యాగరాజనారాయణదాస సేవాసమితి ప్రతిసంవత్సరం పిబ్రవరిలో గానకచేరీతోపాటు హరికధాసప్తాహంకూడా నిర్వహిస్తూ యీ రంగానికి ప్రోత్సాహాన్నందిస్తున్నారు.
    తాడేపల్లిగూడెంలో శ్త్రె పెదపాటికృష్ణమూర్తి భాగవతార్ గారు కార్యదర్శిగా 'హరికధాపరిషత్" అనే సంస్థకూడా యీరంగంలో ఎందరో యువకళాకారులకు తర్ఫీదుయిస్తూ, నెలనెలా పరిషత్ లో కధలనుఏర్పాటు చేస్తూ సేవలందిస్తోంది.
     ఆంధ్రవిశ్వవిద్యాలయంవారు యీకధారంగంలోప్రవీణులైన అమ్ముల విశ్వనాధం భాగవతార్ వంతి వారికి కళాప్రపూర్ణ బిరుదులివ్వడం ఉన్నత విద్యారంగంకూడా దీనిని విశిష్టకళగా గుర్తించిందనడానికి నిదర్శనం.