పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/310

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బు ర్ర క ధ

  • 'కధకుడు కాలికిగజ్జెకట్టి, చేతవాయిద్యములుధరించి వంతపాటగాడి సహాయమున అవేశపూరితుడై కించిదవయవచాలవచాలనమున, పదవిన్యాసమున, లయబద్ధమున ప్రజాసమూహమునెదుట గానముచేయును. ఇట్టివానికె ఆంధ్రదేశమున బుర్రకధలనియు, జంగమకధలనియు, పదములనియు, తందాన కధలనియు, పురాణమనియు, కతలని వ్యవహారమున కలదు. కధకుడు చేతియందు సొరబుర్రతోడనో, గుమ్మడిబుర్రతోడనో చేసిన తంభురా, శారద వంటి వాధ్యములధరించి వాని ధ్వనులతో మేళవించినగానముగల కధలను పాడుటచేవీనికి బుర్రకధల పేరువచ్చింది."
     తెలుగువారి జానపద కళాఖండాలలో బుర్రకధస్థానం అపూర్వమినది.  ఇది అచ్చమైన ప్రజాకళ.  ఆదినుండీ తెలుగుదేశంలోయిది తెలుగువాడిని ప్రతిస్పందిస్తూ, వినోదాన్నంద్స్తూ గత అర్ధశతాబ్దిన్ండీ విజ్ఞానాన్ని వెదజల్లేసాధనంగాకూడా మలచబడి నిలంబడింది.
    దీని "చరిత్ర - గమనము" నిజంగా పరిశోదించదగ్గ అంశమే - అయినా యూనివర్సిటీలదృష్టి ఎందుకు దీనిమీదకి వెళ్ళలేదో ! ఇదికూడా యక్షగానప్రక్రియే గనుక సాహిత్యంలో దీనిక్కూడా స్థానముంది.  స్థూలంగా తెలిసినంతవరకూ మనకులభ్యమవుతున్న కధలలో బాలనాగమ్మ, కాంభోజరారు, ముగ్గురుమరాటీలు, లక్షమమ్మ, కామమ్మ కధలు ప్రాచీనములు.
      ఇవి ఏకాలంలోపుట్టాయిఅని ఆలొచిస్తే బాలనాగమ్మ కధ రంగనాధరామాయణానికి ముందే తెలుగుదేశంలో ప్రచారంలోవున్నట్లు కనబడుతోంది.  ఎందుకంటే వాల్మీకి రామాయణంలో లక్ష్మణరేఖ ప్రసక్తిలేదు.  ఇది తొలిసరిగా రంగనాధరామాయణంలోనే కనిపిస్తోంది.  మరి యిందులో యిది ఎలావచ్చిందీ 

ఆలోచిస్తే తెలుగునాట జనసామాన్యంలో అప్పటికే బహుశా బహుప్రచారంలోనున్న బాలనాగమ్మ కధలోని కార్యవర్ది రాజు యుద్ధానికివెళుతూ బాలనాగమ్మను దాతవలదని గీచిన గీతలే


  • తెలుగుజానపదగేయాగాధలు పు.21 డా|| నాయని కృష్ణకుమారి.