పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/308

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8. పె.రామకుమారిగారు:-

  అంగన (తూ.గో) పాడుగుపాండురంగదాసుగారి శిష్యురాలు.  బ్రహ్మంగారిచరిత్ర సీరియల్ గా ఎన్నో చోట్లచెప్పి గౌరవింపబడ్డారు.

9. సుశీల భాగవతారిణిగారు:-

    రాజమండ్రి మొదట్లోబేతా రామచంద్రరావుగారిట్రూపులో నాటకాలు వేసేవారు.  అనంతరం కధలునేర్చుకుని యీరంగంలోకృషిచేస్తున్న విదుషీమణి.  ఈగ్రంధరచయితతో కలిసి "సుభాస్ చంద్రబోసు" జముకుల కధకూడా చక్కగాఫ్చెప్పేరు.

10. దువ్వూరి సత్యవతి భాగవతారిణిగారు:-

   కాకినాడ.  దీక్షితదాసుగారి శిష్యురాలు.  తులసీజలంధర, మారుతి చిటికెలు, సతీసుమరి, ద్రౌపదీస్వయంవరం, ద్రౌపదీమానసంరక్షణం, సుగ్రీవవిజయం, కృష్ణరాయంబారం మున్నగు విదికధలు చెబుతారు.  ద్రౌపదీమానసంరక్షణం వీరికి గుర్తింపుతెచ్చినకధ.  మార్కాపురంలో "గానకోకిల" బిరుదుతో సత్కారించారు.

11. రంగమాంబభాగవతారిణిగారు:-

భీమవరం. మంచికధకురాలు. భారతం నెలరోజులు సీరియల్ గాచెప్పి మెప్పిందిట్టగా పేరుగన్నారు. వల్లీకళ్యాణం అద్భుతంగా చెబుతారు. పద్యంచదవడంలో యీమెమధురగాత్రం యీమకు వరం.

12. అచ్చమాంబ భాగవతారిణిగారు:-

   కాకినాడ.  నారాయణదాసుగారువ్రాసిన సావిత్రిచరిత్రే, యితర విదికధలూ యించుమించు 10 దాకా చెబుతారు.

13.శార్వాణీ భాగవతారిణిగారు:-

   కాకినాడ. ఈమెకధలో పాండిత్యంఎక్కువ.  రామాయణం సీరియల్ చెబుతారు.  చాలాచోత్ల సన్మానాలుపొందారు.

14. కొచ్దెర్లమల్లేశ్వరి భాగవతారిణిగారు:-

  భీమవరం.  ఈమచక్కని నాట్యంతో కీర్తనలుపాడి అభిఉనయంతో కధనడిపిస్తారు.  సినీపా'టలుచక్కగా అనుకరిస్తారు.  ప్రేక్షకులమీద యిదో సమ్మోహనం.