పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/307

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2. మంత్రిప్రగడ లలితకుమారిగారు:-

    భీమవరం.  ములుకుట్ల అన్నపూర్ణరావుగారి శిష్యురాలు.  కధ నాటకంగా చెప్పడం వీరి ప్రత్యేకత.  "రామభక్తి" వీరివిశేషకధ.  భక్తివీరరసములు ఎక్కువగా పోషిస్తార్  ఎన్నో బిరుదులు, సన్మానాలు పొందారు.  రామాంజనేయయుద్ధం, గయోపాఖ్యానంకధలు చెప్పేటప్పుడు ఆనాటకాలలోని పద్యాలు రంగస్థలిలో చదివినట్లు చదువుతారు.  కధను పాత్రలసంభాషణరీతిలోచెప్పి జనాన్ని ఉర్రూతలూగిస్తారు.

3. పువ్వుల పుష్పవనంగారు:-

     ఏలూరు.  సుమారు పదివిడికధలుచప్పేవారు.  అనేకరాష్ట్రాలు పర్యటించి పేరుతెచ్చుకున్నారు.  శృంగారరసప్రాధాన్య్హతతో కధ రక్తిగా ఉండేది.

4. యాళ్ళభండి శారదగారు:-

    తాడేపల్లిగూడెం.  యాళ్ళబండితాతారావు భాగవతార్ గారి కుమార్తె, శిష్యురాలు. కధ భక్తిరసప్రధానంగాచెబుతారు.  మీరాబాయి, ద్రౌపదీ మానసంరక్షణం వీరికి పేరుచెచ్చిన కధలు.

5. డి. జ్యోతిర్మయాంబగారు:-

     ఏలూరు.  సీరియల్ గా రామాయణం, ఇతరవిడికధలు చెప్పేవారు.  కధ చురుకుగాఉంది అందర్నీ ఆకర్షించేది.  విజయముద్రిక, సుబద్రా పరిణయం, భీమార్జునగర్వభంగం వీరి పేరెన్నికగన్న కధలు.

6. పెండ్యాల సుందరమ్మగారు:-

      రాజమండ్రి.  నాటకాలలో వేషాలువేసేవారు. తరువాత కధలు నెర్చుకుని కధలుచెప్పేవారు.  వీరుచెప్పడంలోని చమత్కారం కధను రక్తికట్టించేది.

7. వి.సత్యవేణి భాగవరారిణిగారు:-

   రాజమండ్రి.  కత్తులకృష్ణారావు, కడలి వీరదాసుగార్లవద్ధ కధలు నేర్చుకున్నారు.  చక్కనికధకురాలు.  సుభద్రాపరిణయం, ద్రోపదీపరిణయం ఈమెకధలలో సుప్రసిద్ధములు.  వీరు కధాగానపరిషత్ కార్యదర్శి.