పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/306

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

48. శ్రీ కొవ్వూరి కృష్ణారెడ్డీ భాగవతార్:-

   కొమరిపాలెం. (తూ.గో.) చక్కని వయొలిన్ విద్వాంసులు - కధకులు. వీరికధలో శాస్త్రీయసంగీతంగుబాళింపు ఎక్కువ. మధురమైన గాత్రం. కధలోలీనమైచెప్పేవారు.

49. అద్దేపల్లి లక్ష్మణశాస్త్రిగారు:-

   రాజమండ్రి. వేలాదిప్రజలను కధతో ఇట్టేఆకట్టుకొనేవారు. ఎంత దూరం కధకివెళ్ళినా టాక్సీలోనేవెళ్ళేవారు. కధలో మధ్యమధ్యన సినిమాలోలాగ పదినిమిషాలపాటు విశ్రాంతియిచ్చేవారు.  విశ్రాంతిసమయంలో జనంలేచివెళ్ళినా కధ ప్రారంబించేటప్పటికి ఎక్కడివారక్కడే వచ్చి కూర్చునేవారు.

50.శ్రీ కాశిన వీరభద్ర భాగవతార్:-

    వీరిది పెద్దాపురం. వుత్పలబ్రమరదాసుగారి శిష్యులు. సత్యహరిచ్చంద్ర, భక్తమార్కండేయ, సతీసావిత్రి, జ్యయప్రద విడికధలు, రామాయణ భారత కధలు చెబుతారు. పెద్దాపురంలో బ్రహ్మాండమైన సన్మానం జరిగింది.

51. శ్రీ మత్తుర్తి వీరబ్రహ్మానంద భాగవతార్:-

  పెద్దాపురంలో నివాసం. యదార్ధరామాయణం, మహాభారతం, బ్రహ్మంగారిచరిత్ర కధలు చెబుతారు. తాళ్ళరేవులో సింహకలాటం, దేవరావల్లి, శృంగవరపుకోటలో కేయూరసన్మానములు పొందారు.

భాగవతారిణులు:-

ఆకి దుర్గాంబగారు:-

స్వస్థలం భీమవరం. ఎన్నోచోట్ల భారతం సీర్యల్ గా చెప్పేవారు. సుమారు 150 మెడల్సులు బహుమతిగాపొందారు. వీనిని దండలుగా మెడలోధరించేవారు. కధలో శ్రావ్యత, నిర్మలత యీమెప్రత్యేకత. వీరు తిరుపతి శ్రీవెంకటేశ్వర సంగీతకళాశాలలో హరికధాలెక్చరర్ గా పనిచేస్తున్నారు.