పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/298

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నివాసి. హరికచెప్పడంలో అందెవేసిన చెయ్యి. రామాయణ, భారత భాగవతాలు హరికధలుగా వ్రాసి సీరియల్సుగా చెప్పడమేగాక తుకారాం, మీరాబాయి, చోకామేళ, మార్కండేయవంటి భక్తశిఖామణుల కధలు "భక్తివిజయం" పేరవ్రాసి విదికధలుగా చెప్పేవారు. అందులో ఆశ్పృశ్యతానివారణమీద వ్రాసిన భక్తచోకామేశకిఅధ నిజానికి సాంఘికవిప్లవప్రబోధానికి గొప్ప ఆయుధమే. చొకామేశుడు హరిజనబాలుడు. అతను భక్తినిష్థలతోఉండే (బాలయోగిలా) ఆ హరిజనపేట పెద్దలువరించేతీరు జానపదపరసల్లో నుంచి పసందుగాఉంటుంది యిలాగ:-

"అబ్బోసిరా బోసిరా యీడియేదాంత
  మంతకంతకు హెచ్చిపోనాది
  ఈడబ్బ నాడెపుడైన యీ యాసమున్నదా
  అందరికి మసిరిగిపోనాదీ -

పల్లెటూళ్ళలో ఈ వరసలుపాడుతూ ఆయన కధచెబుతుంటే ఆత్మీయంగా వినేవారు. దేశభక్తిపూరితంగా భారతస్వాతంత్రోద్యమచరిత్రను జాజీయభారతం అని వ్రాశారు. మంచి సంగీతవేత్త, నిండైన విగ్రహం, మధ్యపాపిడి, సిగముడి, మూతినిమీసం, బంగారుదండకడియాలు, సింహతలాటంమురుగులు, ముఖాన నామంబొట్టు, పట్టు పీతాంబరాలు ఆయన వేషం.- ఆయన సెరియల్ కధ చెప్పితే కకకవర్షమె, ఒక్స ఊళ్ళో యీయేడు భారతం సీరియల్చెబితే, మరుసటీసంవత్సరం రామాయణం సీరియల్ చెప్పించేవారు. ఆసువుగాకూడా కధచెప్పడం అలవాటు. అనెక మంది శిష్యుల్ని తయారుచేశారు. గ్రామాల్లోన్ని కక్షల్ని యితివృత్తంగా తీసికొని "పల్లెటూరు" అని ఒక నాటకంకూడా వ్రాశారు.

8. కొమ్మూరి బాలబ్రహ్మానందదసుగారు:

   వీరిది రాజమండ్రి, కవి, కధకుడు, కవిసర్వభౌమ శ్రీశ్రీపాద కృష్ణమూర్రిగారి శిషులు.  ఎన్నోచోట్ల భారతం సీరియల్ గా చెప్పేరు.  నలచరిత్ర, వీరభద్రవిజయం కధలు గొప్ప రక్తిగాచెప్పేవారు.  వీరరసపోషణ వీరిసొత్తు.  సువర్ణగండపెండేరం, ఘంటాకంఠద్యయ భుజకీర్తులు, సువర్ణకకిరీటసన్మానాలు, అనెకబిరుదులుపొంది పేరెన్నికగన్న కధకులు.  దాలామందిశిష్యుల్ని తయారుచేశారు.  పొడుగుపాండురంగదాసు, కట్టా శరభాచారి, పట్నాల మల్లేశ్వరరావు వీరి శిష్యులే.