పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/299

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

9. యాళ్ళబండి తాతారావు భాగవతారు:-

   వీరు తాడేపల్లిగూడేం వాస్తవ్యులు ముసునూరి సూర్యనారాయణ గారి శిష్య్హులు. కధ సంగీతమయంగాఉండేది.  కధ ఏదిచిప్పినా మధ్యమధ్య బెంగాల్ కరువువంట్ దారుణఘట్టాలు చెప్పి జనుల్ని ఆవేశపూరితుల్ని ఛేసేవారు.  జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు వ్రాసిన "కూర్చుండ మాయింట కుర్చీలులేవు" అనె అద్యం వీరినోటినుంచిరాగానే వస్సుమోర్ లు మారుమ్రోగిపోయేవి.  స్వామివివేకానంద, ద్రౌపదీవస్త్రాపహరణం వీరి ప్రత్యేకతగన్న కధలు రసభరితంగా కధచెప్పడం వీరిలోని విశేషం.

10. ముదపాక మల్లెశ్వరరావుగారు:-

     వీరిది భీమవరం, కధకులేకాకుండాచక్కని సంగీతవిధ్యాంసులు కూడా. వీరు మొదట 'లవకుశ్ ' చిత్రంలో నటించారు.  కధ ఎంతో ఆకర్షణీయంగా చెప్పేవారు.  గాంధర్వగానంచేస్తూ ఎన్నో అపురూప రాగాలు పాడేవారు.  పాండవసందేశం, తులసీజలంధర, వీరినోట ప్రసిద్ధి పొందిన కధలు, అందులో జలంధర అద్భుతం.

11. శ్రీ మరువాడ రామమూర్తి భాగవతార్; -

    వీరు కాకినాడనివాసి. రాజమండ్రి గున్నేశ్వరరావుగారి కంపెనీలో ప్రముఖపాత్రలుధరిచ్మి పేరుగడించారు. ఆ తరువాత నారాయణదాసుగారికి శిష్యులై కధకునిగా పేరుగడించారు.  శృంగార రసపోషణలో రక్తిగా కధనడిపించేవారు.  వీరికి రామాయణం సీరియల్ కధలు ఎక్కవ.

12. శ్రీ బళ్ళ బసవలింగ బావతార్:_

         స్వస్థలం మండపేట.  పుచ్చల భ్రమరదాసుగారి శిష్యులు.  కవి, కధకుడు, కధలో యితరవిషయాలేవీ చెప్పకుండా, హాస్యంజోలికిపోకుండా అపూర్వగాధలకు, దండకాలకు ప్రధాన్యమిచ్చి సాహిత్యపరంగా కధ చెప్పేవారు.  శివలీలలు, దశావతారాలు, కృష్ణరాయబారం ఇత్యాదికధలు భక్తి భక్తిరసభరసభరితంగా చెప్పేవారు.  ఏకసంధాగ్రాహి.  బహుగ్రంధ పరిచయం కలవారు.  తునిమహారజువారిచే నవరత్నములు పొదిగిన ఘంటాకంకన సన్మానంపొందారు.  బెండపూడి సాధూగరిదగ్గర ఉపెదేశం పొందారు.  కధ సంసృతాధభూయిష్టంగా ఉన్నా జనవశీకరణ ఎక్కువగా ఉండేది.