పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/297

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3. శ్రీ పెంటపాటిసుబ్బయ్య భగవతార్:-

       వీరి స్వస్థానం ఉంగుటూరు (ప.గో.) వాజపయాజులవారి శిష్యులు.  నారాయణదాసుగారి రామాయణం, భాగవతం సీరియల్సు గా లెక్కలేనన్ని కధలుచెప్పేరు. బహుశ: యిన్నికధలు దేశంలో మరెవ్వరూ చెప్పివుండరు.  భక్తి, వీరరసములు పోషించడంలోవీరి ప్రతిభ అద్బుతం.  చాలామంది శిస్యుల్ని తయారుచేసిన గురువు.

4. శ్రీ పరిమి సుబ్రహ్మణ్య భాగవతార్:-

    వీరిది ఫోతునూరు (ప.గో.) చక్కని రచయిత, మంచి కధకులు.  భారతం, భాగవతం మరెన్నో కధలు రచించారు.  ఏ హరిదాసైనా పార్వతీకళ్యాణం కధచెబితే వీరు వ్రాసిందేచెబుతారు.  అది అంతబాఆ ఉంటుంది.  వీరికధలలో భక్తి, రక్తి ఎక్కువ.  భారత, భాగవత కధలు నెలలత్రబడి చెప్పేవారు. అనెకమంది శిష్యుల్ని తయారుచేశారు.  

5. శ్రీ ములుట్ల అన్నపూర్ణారావు భాగవతార్:-

      వీరి స్వస్త్ర్హలం తణుకు.  వాజపయాజుల సుబ్బయ్యగరి శిష్యులు.  తరుచు తామాయణం సీరియల్ గా దెప్పేవారు.  శృంగార రసపోషణ వీరికధలో ఎక్కువగా పోషింపబడేవి.  సీతాకళ్యాణం, సావిత్రి కధలకు వీరు ప్రసిద్ధులు.  ఎంతోమందిశిష్యుల్ని తయారుచేశారు.  సంగీతశిఖామణి, లయబ్రహ్మా అనేవారు.

6. పుచ్చల భ్రమర్ధాసుగారు:-

    వీరు రాజమండ్రినివాసి.  గున్నెశ్వరరావుగారి నాటక కంపెనీలో ముఖ్యపాత్రలు ధరించేవారు.  ఆతరువాత వాజపయాజుల సుబ్బయ్య గారి శిష్యులై కధలు నేర్చుకుని హరికధకునిగా చాలాపేరు సంపాదించారు.  భక్తమార్కండేయగ్రామఫోనురికార్డుకూడా యిచ్చారు.  కధలో యితర విషల్లకంటే కధనే ఎక్కువగా పోషించేవారు.  వీరి రూపంలోనూ, కధా గానంలోనూ నారాయణదాసుగరి పోలికలుండేవి.

7. శ్రీ నల్లమిల్లి బసివిరెడ్డి భావబతార్:-

   తూర్పుగోదావరిజిల్లా రామచంద్రాఉరందగ్గర రామవరం గ్రామ