పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/294

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వేషంవేసుకువెళ్లాడట. భీమునికి ఎవరు అన్నం వడ్డించినా అతడు భీముడని తెలిసిపొతుంది. అందువల్ల తనకు తానే పెట్టుకుతింటే ఇతరులకు తెలియడానికి అవకాశంఉండదని నలలుడివేషంలో వంటకాలలోకి వెళ్ళాదట. అర్జునుడు ఆజానుబాహుదు. గొప్ప అందగాడు. బయట ఎక్కడ కనిపించినా ఇతడు అర్జునుడని పోల్చుకోవచ్చు. అందుకని పేడివానివేషంలో బృహన్నలగా అంత:పురంలోకి ప్రవేశించాడట. ఇక సహదేఫుడు పశువులుకాసే నెపంతో పొలిమెరలలో తిరుగుతూ శత్రువుల జాడతెలిసినవెంటనే ఆ వార్త చేరవేయడానికి వీలుగా పశులకాపరిగా వెళ్లాడట. వార్తాందగానే పారిపోవడానికి వీలుగా అయిదుగురకూ అయిదుగుర్రాలు సిద్ధంగాఉంచడంకోసం నకులుడు ఆశ్ఫశాలలో ప్రవేశించాడట ఇలా ప్రతీదీ విమర్శనాత్మకంగా చెప్పుకుపోతుండడం ఇందులోని ప్రత్యేకత. పైగా ప్రస్తుత రాజకీయాల మిళాయింపు దీనికి పట్టు.

  కూరకు తాలింపు, బట్టకు జాడింపు, శాలువాకు జోడింపు, దాసుకు చదివింపు ఉండితీరాలన్నారు బుగ్గా పాపయ్యశాస్త్రిగారు.  నిజమే - ఈ చదివింపులే దాసుగారి కధకు హుషారు.  ఒక్కొక్క చదివింపూ వస్తుంటే "ఫలానావారు నన్ను ఆశీర్వదించిభగవదర్పిదంగా చదివించినవి యిన్నిరూపాయలు, ఆ పరమాత్ముడు వారికి అనంతకోటిరూపాయలు ఇచ్చి రక్షించుగాక" అని దీవిస్తుంటారు.  గ్రామాల్లో ఈ కట్నాలు పోటీపడి మరీచదివిస్తారు  పేరుకోసం. కరణంగారపద్దు ఇరవైఐతే, మునసబుగరిపద్దుయాభై కావలసిందే.  ఇవేకాకుండా 'సీతాకళ్యాణం ' వంటి ఘట్టాలు వచ్చినప్పుడూ, ఆఖరున పట్టాభిషేకంఘట్టంలోనూ భార్యాభర్తలజంటలు పీటల మీద కూర్చుని వానినిజరిపించడంఅనే తంతుపెడతారు.  ఇక్కడ వారు పెట్టే పంచెలు, చీరలు, జామార్లు, దక్షిణతాంబూలాలు దాసుగారికే దక్కుతాయి.  బ్రహ్మంగారి 'కాలజ్ఞానం ' చెప్పే హరిదాసులు ఆఖరున "జేజి నాయనకు ఆరాధన" అని పెడతారు.  గ్రామంలో స్త్రీలందరూ పళ్ళాలనిండా బియ్యం, ఆకులూ, వక్కలూ, కొత్తబట్టలూ పట్టుకువచ్చి సత్యనారాయణ వ్రతంలోవలె బారులుతీరికూర్చుని పూజలు చేసినంస్కరించుకుంటారు.  తరువాత అవి దాసుగారికే చెందుతాయి.