పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/293

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దెబ్బకు కర్ణుడు నేలవ్రాలెను. ఈ వృత్తాంతాన్ని శ్రీకోట చెబుతుంటే కంటతడిపెట్టని ప్రేక్షడెవడూ ఉండరు.

    అలాగే రావు కమలకుమారి 'ప్రమీలార్జునీయం ' కధలో ప్రమీలాదులు వనవిహరంలో ఉయ్యాలలు ఎలా ఊగుతున్నారో కళ్ళకుకట్టినట్టు అభినయ్హంతో చెబుతుంటే హాలులో ప్రతిఒక్కరూ ఊగిపొవసిందే.  బళ్ల బసవలింగం గారు 'గంగావతారణం ' లో -

'జటా కటాహ సంభ్రమ భ్రమన్ని లింప్త నిర్ఝ రీ,
 విలోల వీచి నల్లరీ విరాజమాన ముర్దశి"
 ధగధగధగజ్జ్వలల్ల లాటపట్టపావకే
 కిశోరచంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ !
 ఓం నమశ్సివాయ ... ...
 ప్రపుల్ల నీలవపంకజ ప్రపంచ కాళిమచ్చటా
 విదంబి కంతకంధరా రుచిప్రబంధకంధరం
 స్మరచ్బిధం పురచ్చిధం భవచ్చిధం ముఖచ్చిధం
 గజచ్చిదాంధ ఖచ్చితం తమంతఖచ్చితంభజే !
 ఓం నమశ్శివాయ ... ... ... ..
జయత్వదభ్రవిభ్రమభ్రమద్బుజంగమస్పురత్
ధగధగర్వినిర్గమత్కరాళఫాలహవ్యవాట్
ధిమిధిమిధిమిధ్యనన్ మృదంగతుంగ మంగళా
ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవశ్శివా "
  

అని రావణస్రోకతమైన శివస్తోత్రం చదువుతుంటే ప్రతివారూ భక్తిరసంలో మునిగి తేలవలసిందే.

  నలాది భాస్కరరావు 'నర్తనశాల ' హరికధా రంగంలో ఒక విప్లవం.  మంచి విమర్శ, చక్కని చమత్కారం, మొదడుకు గొప్పమేత.  పాండవులు అజ్ఞాతవాసంలో ఆ వేషాలె ఎందుకు వేశారు అనేదానికి కట్టమంచి రామలింగారెడ్దిగారు భారత విమర్శలో ఇలా వ్రాశారనిచెబుతారు - రాజసూయయాగం చేసినవాడు ఎవరికీ ముందుగా నమస్కరించకూడదట.  ధర్మరాజు రాజసూయయాగం చేశాడు.  మరి ఉద్యోగం అర్ధించేవాడు ముందు నమస్కరించకపోతే ఎట్లా? అయితే ఆరోజుల్లో బ్రాహ్మణులకు రాజులు కూడా ముందునమస్కారం చేసేవారట.  అందువల్ల ధర్మరాజు కంకుభట్టు