పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/295

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంతేకాకుండా సభలో హారతిపళ్ళెం ఒకటి ప్రతితోజూ త్రిప్పుతారు. ఆపళ్ళెంలో వచ్చింది సాధారణంగా ఆరోజు ఖర్చు ఎత్తేస్తుంది. (ఆపళ్ళెంలో అక్కడక్కడ ర్ధరూపాయివేసి తొంభైపైసలుతీసుకోవడం కూడాకద్దు). ప్పుడాప్పుడు కధదగ్గరపెట్టిన దేవుడుపొటోని పల్లకీలోపెట్టి ఊరంతా ఊరేగిస్తుంటారు. ఇంటింటా హారతులిచ్చి పళ్ళలతో బియ్యం పోసేవారు, ఈబియ్యంతో దాసుగారు ఆఖరురోజున సంతర్పణచేసేవారు. దాసుల్లో దంతవేదాంతులు అవికూడాఅమ్మేసుకొని డబ్బుచేసుకొనేవారు. ఇలాంటివాళ్ళతోనే హరికధాకులానికి గౌరవం పడిపోసాగింది. పైగా పాందిత్యం తక్కువై, ప్రగల్బాలు ఎక్కువై ప్రజలకు బోరుకొట్టేయడం ప్రారంభించిది. అందుకే రావుగూపాలరావుగారి "హరికధల్ చెప్పకు" అనే ముత్యాలముగ్గు డైలాగు బలేగపేలింది జనంలో.

  హరికధ నేడు ఎంతచిక్కిపోయిందో పిట్టకధల్లో హరిదాసులే చబుతుంటారు.  ఒక ఊళ్లో హరికధజరుగుతుందట - కధ మధ్యలో జనమంతా వెళ్ళిపోయారట.  కాని ఇద్దరుమాత్రం చివ్రివరకూ కూర్చున్నారట.  వారిని చూసి దాసుగరు సంతోషించి "కనీసం మీరైనా కధకోస్ం ఇంతశ్రద్ధగా కూర్చున్నందుకు నా ధన్యవాదాలు" అంటే, వాళ్ళూ "అయ్యా! మేము కూర్చున్నది మీ కధకోసంకాదు.  మీరుకూర్చున్న బల్లలకోసం, అవికరణంగారిబల్లలు. కధ అయిపోగానే ఇంటికిచేర్చెయ్యమన్నారు - అందుకని" అన్నారటా.
  ఈ స్థితికి హరిదాసులే చాలవరకు బాధ్యులు.  మారుతున్న సమాజానికి అనుగుణంగా ప్రక్రియ మార్చుకోలేకపోవడం, తగినంత కృషి చేయకపోవడం, ప్రతిభవిహీనులు రంగప్రవేశంచేయడం, ప్రజానాడిని పట్టుకోలేకపొవడం, హరికధ్కు ఆదరన తగ్గడానికి ముఖ్యకారణాలు.  అంతేకాకుండా జనాబిరుచికి అనుగుణంగా కొత్తకధలు వ్రాయడంలేదు.  అసలిపుడు హరికధా రచయితలేలేరు.  ఒకరిద్దరు సిద్ధపడినా వారి పాత ఫక్కీరచన జనానికి రుచించడంలేదు  ఒకనాడు పల్లెవాసులలో విజ్ఞాన వికాసాలు పెంపొందించి నీతినిమాలునేర్పింది ఈ ప్రజాకళే.  పతన మైపోతున్న నేటిసమాజంలో నైతికవిలువల పునరుద్ధరణనిమిత్తం ప్రభుత్వంమళ్ళీ దీన్ని తీర్చిదిద్ది ప్రోత్సహిస్తే మంచి ప్రచారసాధనంగా ఉపయోగడగలదు.