పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/290

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దాసుగారు వేషధారణచేసి, తిలకం దిద్దుకుని, బల్లమీదకువచ్చి కూర్చుని ఇష్టదేవతాప్రార్ధన చేసేవారు. తరువాత నిలిచి, పైనకప్పుకున్నకందువా మొలకు చుట్టుకొని "శ్రీమద్రమమారణ గొవిందోహరి" "శ్రీ ఆంజనేయవరద గొవిందోహరి" శ్రీపుండరీకాక్షవరద గోవిందో హరి" అని అందరిచేతా గోవిందగొబ్బలకొట్టించి ప్రేక్షకుల్ని కధోన్ముఖుల్ని చేయడం పరిపాటి. ప్రేక్షకుల్ని కధాకార్యక్రమంలో భాగస్వాములుగా చేయడానికి కొందరు దాసులు పదినిముషాలు భజనచేయించడంకూడా కద్దు.

    ఒకసారి పొడుగు పాండురంగదాసుగారు తనతోపాటు అందరూ భజన చెయ్యకపోవడంచూసి ఒకవిశేషంచెబుతానువినండని చెప్పడం ప్రారంభించాడు. ఒకరోజు ఒక శిష్యుడు గురువుగారిని రామనామం యొక్కగొప్పతనం ఏమిటి అని అడిగాడట.   దానికి గురువుగారు కాకినాడ జగన్నాధపురంలో సత్తెమ్మగద్దెఉంది, ఆ గద్దెమీద ఈశాన్యమూలలో సాలెగూడు ఉంది.  ఆ సాలెగూడులో సాలెపురుగు ఉంది.  ధాన్నడుగుచెబుతుందన్నాడు.  శిష్యుడక్కడికి వెళ్ళి రామనామంయొక్క గొప్పతనం ఏమిటి అన్నాడట - అంతే - అది గిరుక్కునతిరిగి నేలమీదపడి చచ్చిందట.  ఆవిషయంవచ్చి గురువుగారి చెప్పగా, అయితే రాజమండ్రి వెత్సావారింట్లో చిలకపంజరం ఉంది, ఆపంజరంలోని చిలక నదుగు చెబుతుందన్నాడట.  శిష్యుడక్కడికివెళ్ళి రామనామంయొక్క గొప్పతనం ఏమిటి? అని అనెసరికల్ల అది ముమ్మారు కిచకిచమని ప్రాణం వదిలెసిందట.  ఇదేంటనివచ్చి గురువుగారినడిగితే ఇప్పుడు వేమగిరిలో సూరాబత్తుల సూరయ్యగారింట్లో కోడెదూడపుడుతోంది, ఆదూడనడుగు చెబుతుందన్నాడట.  సరే అని శిష్యుడు అక్కడికి వెళ్ళేటప్పటికి ఆవు ఈనుతోంది.  కొడెదూడపుట్టింది.  ఆహా గురువుగారిమాట నిజమేఅని దూడదగ్గరకెళ్ళీ రామనామంయొక్క గొప్పతనం ఏమిటి? అన్నాడట.  అంతే అదికూడా చచ్చూరుకుందట.  ఇదేమిటిరా భగవంతుడా అని హడిలిపోయివచ్చి గురువుగారికి చెప్పేసరికి ఇప్పుడు విజయనగరం రాజాగారిభార్య మగబిడ్దను ప్రసవించబొతోంది, వెళ్ళి ఆ బిడ్దనడుగు తప్పక చెబుతాడన్నాడు.  శిష్యుడు అక్కడకు చేరుకొని విచారిస్తే అప్పుడే రాజుగారికిపుత్రోదయందన్నారు.  మళ్ళీ ఇప్పుడు ఈ బిడ్డకూడా ఎక్కడ చచ్చిపోతాడోఅనిభయపడి దూరంగా గోడప్రక్కననిల