పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/291

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బడి రామనామంయొక్క గొప్పతనం ఏమిటి? అన్నాడట. వెంటనే ఆబిడ్డ పగలబడినవ్వి 'ఒయిఅమాయకుడా! ఇంకా అర్ధంకాలేదా? సత్తెమ్మ గుడిదగ్గర సాలెపురుగుని నేనే, నువ్వ్వువచ్చి రామా అన్నావు. ఆజన్మపోయి చిలకజన్మ వచ్చింది. నువ్వు అక్కడికికూడావచ్చి రామా అన్నావు. ఆజన్మపోయి కోడెదూడగా పుట్టాను. అక్కడ మళ్ళా రామా అన్నావు. దానితో ఇక్కడ రాజుగారిబిడ్డగా జన్మించాను. ఇంతకంటే ఏం చెప్పమంటావు రామనామ మహరాల్ని గురించి?" అన్నాడట ఇది చెప్పేటప్పటికి సభ అంతా నిశ్శభ్ధమైపోయింది. దీంతో మొత్తం జనమంతా దాసుగారితోపాటు రామరామ రామసీత్ అంటూ బజన మొదలుపెట్టారు పుణ్యం అప్పుడే పొందెయ్యాలన్నట్టు. ఇలాగ కొందరు దాసులు పిట్టకధలతో ప్రజల్ని ఆకట్టుకునేవారు. కధలో సందర్బానుసారంగా కొన్ని పిట్టకధలుచెబుతూ నవ్విస్తూ వినోదింపజేయడం హరికధలో ముఖ్యభాగం కూడా.

     అనాదిగా హరికధకు భారత, భాగవత, రామాయాణాలు, శివలీలలు, సక్కూబాయి, మీరాబాయి, జయదేవవంటి భక్తుల గాధలుకధా వస్తువులు  ఈ ప్రక్రియ ప్రజలలో మంచి ప్రదార సాధనంగా రాణించడంతో క్రమంగా క్రైస్తవకధలు, ఇస్లాంకధలు కూడా ఇందులో చోటు చేసుకున్నాయి.
     జాతీయోద్యమకాలంలో హరిదాసులుకూడా "నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చా" నన్నట్లు స్వాతంత్ర్య ఉద్యమాన్ని గురించీ, నాయకులగురించీ కధలుచెప్పి చైతన్యాన్ని రేకెత్తించేవారు.  అలాంటివాటిలో జాతీయబారతం, ఝాన్సీరాణి, రాణాప్రతాప్, వీరశివాజీ, నెహ్రూ, తిలక్, భగత్ సింగ్, సుబాష్ చంద్రబోస్, క్రిట్టిండియా,బెంగాల్ కరువు ముఖ్యమైనవి.
  ఆరోజుల్లో యాళ్ళ తాతారావుగారు భాగవతార్ 'బెంగాల్ కరువు ' చెచుతుంటే ప్రేక్షకులు బ్రిటిష్ వాళ్ళను నరికిపోగులుపెట్టెయ్యాలనే స్థితికి వచ్చేవరు.
  సాహిత్యపరంగాచూస్తే హరికధాసాహిత్యంకూడా ఉత్కృష్టమైనదే చక్కని పదబంధం, చందోబద్ధమైనపద్యాలూ, భాగవతాళయుక్తమైన