పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/289

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆదిలో దాసులంతా నారాయణదాసుకారివలెనే కవి గాయక పండితులై ఉండేవారు. అందుచేత హరికధలుకూడా చాలావరకు వారే వ్రాసుకునెవారు. కధారచన చేసినవరిలో పరిమి సుబ్రహ్మణ్య భాగవతార్ గారు, చింతా దీక్షితదాసుగారు, కొమ్మూరి బలబ్రహ్మనందదాసుగారు, నల్లమిల్లి బసివిరెడ్డిగారు, కడలి వీరదసుగారు, పెద్దింటి దీక్షితదాసుగారు పేర్కొన దగినవారు. వీరు శిష్యగణాన్ని తయారుచేసినపద్ధతికూడా ఎంతో ఆత్మీయమైనది. తమ ఇంటిలోనే భోజనాలుపెట్టి సంగీత, సాహిత్య, నృత్య, గాన, కధా విన్యాసాలునేర్పుతూ కధలకు తమతోతీసుకువెళ్ళి కధమధ్యలో పాటలు పాడిస్తూ, అప్పుడప్పుడు ఒక విడికధ చెప్పిస్తూ సభాపిరికిపోగొట్టి స్వంతబిడ్డమాదిరిగా తయారుచేసేవారు. ఆ శిష్యులు కూడా గురువునకు సకలోపచారాలుచేసి కష్టపడి విద్యనేర్చుకొనేవారు. హరికధాకార్యకరమానికి ఒకటిరెండు వారాలుముందుగా కచ్చాబిగించాలిరా అని హెచ్చరించేవారట నారాయణదాసుగారు శిష్యుల్ని. కచ్చాబిగించడంఅంటే బ్రహ్మచర్యం పాటించడమన్నమాట.

    ఇక కధకువెళితే ప్రక్కవాయిద్యగాండ్రతోపాటు శిష్యగణంతొ ఆవూళ్ళో ఉండిపోవడమే.  దాసుగరు పండితుడుకావడంవల్ల ప్రజలమీద ఆయన ప్రభావం ఎక్కువ.  ఆ బృందానికి ఊరివారు రోజుకొకరుచొప్పున సాదరంగాఆహ్వానించి పిండివ్ంటలతో భోజనాలుపెట్టి గౌరవించేవారు.  ఆరాత్రికధలొ దాసుగారు బ్రేవ్ మని త్రేన్చి వారిఆతిధ్యాన్ని పొగుడుతూ ఆ మహాతల్లి, ఆమహాసాద్వి, ఫలానాసుబ్బయమ్మగారు కత్తితోకోసినా తెగని గడ్డపెరుగుతొ బోజనంపెట్టిందంటూ ఆకూరలూ, ఆ పిండివంటలూ వర్ణించి వర్ణించి చెబుతుంటే మలిరోజు భొజనాలుపెట్టేవారు మరింతపోటీగా వంటలు చేయించి భోజనాలుపెట్టేవారు.  ఆ నలబైరోజులూ దాసురికి విందుభొజనాలె. దాసుగారు తమఇంటికిరావడం ఎంతో గొప్పగా భావించేవారు.
 ఊరిమధ్య దేవాలయంవద్ద పచ్చని పందిరివేసి, ఆపందిరిక్రింద బల్లలువేసి, పైనరెందు పెట్రోమాక్సులైట్లుతగిలించి ఆవెలుగులో కధ చెప్పించేవారు.  పగలంతా పొలాలో పనిచేసుకుని రాత్రి భోజనాలు పూర్తిచేసుకుని, కూర్చోవడానికి గొనెబస్తాలు తెచ్చుకొని యింటిల్లపాదీ కధకు వచ్చి వినోదించేవారు.