పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/285

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రాడు పైనడిపించడంవంటి మాయావినోద కార్యక్రమాలు చూసి కట్నాలుగా డబ్బు, పాతచీరలు, పాత పంచెలు వసూలుచేసుకుంటారు.

  • "ప్రయోగయోగ్యమైన ఉత్తమనాటకమువలె యీ పగటి వేష

  ధారణ అన్ని పరీక్షలకు నిలువగలిగిన కళాఖండము. సాహితీ
  రంగమున మహాకచ్వ్యమునకు ఖండ కావ్యమువలె నాటకమున
  కిది రంగశాల పనిలేని ఏకాంకిక వంటిది".
 

వీనిలో సంగీతముంది, సాహిత్యముంది, నాట్యముంది. ఈ ప్రజాకళాకారులు తమ వేషాలతో జనాన్ని ఆకట్టుకుని పొట్టపోసుకోగలిగేవారు. కాని నైతికవిలువలు పడిపోయి సమాజంలో పెద్దవాడినుంచి చిన్నవాడివరకూ ప్రతివాడూ పగటివేషధారణచేస్తున్న యీరోజుల్లో అసలు వేషాలు నిలబడలేక క్షీణదశకు చేరుకున్నాయి. నేటివరకూ ఇవి గ్రంధస్థం కాలేదు. దీనిమీద తగుశ్రద్ధ చూపకుంటే యిప్పట్కే క్షీణదశకు చేరుకున్న యీ ప్రజాకళ నశించిపోయే ప్రమారముంది. ఆయా వేషధారుల మాటల్ని, పాటల్ని రికార్డుచేసి, వేషాలు ఫొటోలుతీయించి భద్రపరచి ముందు తరాలవారికి కనీసం మ్యూజియం వస్తువుగానైనా అందచేయడం తెలుగు విద్యాలయంవారి విధి.

                                హరికధ
  తెలుగువారి స్వంతం అని గర్వంగాచెప్పుకొనే సాహిత్యప్రక్రియ అష్ఠావధానం.  అలాగే కళారంగంలో మనదీ అని చెప్పుకొనే కళాప్రక్రియ హరికధ.
   ఇదిమరాఠీనుండో, కన్నడంనుండో, తమిళంనుండో దిగుమతి అయిందని చీప్పేవరు లేకపోలేదు.  అయితే వారు ఒకవాస్తవాన్ని గమనించలేదనిపిస్తుంది.  ఆయా బాషలలొ హరికధలుగా చలామణి అయ్యే మరాఠీ వారి "సంకీర్తన" (ఆభంగ్), కన్నడిగుల 'కీర్తన" తమిళుల "కాలక్షేపాల"కు తెలుగుహరికధకు మౌలికంగా ఎంతో భేదం ఉంది.  అవన్నీ ఏకప్రాణజన్యం, తెలుగుహరికధ పంచప్రాణజన్యం, కన్నడిగులకీర్తనలో ప్రవచనానికే ప్రాధాన్యం.  మరాఠీలసంకీర్తనకు భజనరీతి ప్రాణం

  * విజ్ఞాన సర్ఫస్వం. సంస్కృత్తి  పు.314