పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/286

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తమిళులకాఅక్షేపం సంగీతమయం - ఇంచుమించు గానకచేరీ. తెలుగు హరికధ అట్లాకాదు. ఇది సంగీత, సాహిత్య, నృత్య, గాన, అభినయాల సమతూకపు సమాహార కల.

  • "తమిళ, కన్నడ దేశాలలోని 'కాలక్షేప ' రీతికిని "కీర్తన" సంప్రదాయానికిని మరాఠీకళారూపం మూలమని పరిశోధకులనిర్ధారణ. తెలుగులో ఇది అసలు మొక్కగానే అంకురించిందిగాని వారూవీరూ ఊహించినట్లుగా అంటుమొక్కకాదు. మరాఠీహరికధ తెలుగుహరి కధను కొంతలో కొంత ప్రభావితం చేసి ఉండవచ్చుగాని తెలుగుహరికధ మరాఠీ వ్యుత్పత్తి కం కానెకాదు"
     తెలుగుహరికధకు మూలంవెదికితే తెలుగునాటనె కనిపిస్తుంది.  పన్నెండవ శతాబ్ది 'పండితారాద్యచరిత్ర" నాటినుండే ప్రాచుర్యంలో ఉన్న మన జానపద కళ యక్షగానం.  దీని స్వరూపానికీ హరికధ స్వరూపానికె పెద్ద తేడాళేదు.  అవే అంగాలు - కాకపొతే యక్షగానంలో బహుపాత్రలు పలువురు వ్యూక్తులు ఇర్ఫ్వహిస్తే హరికధలో అన్నిపాత్రలనూ ఏవ్యక్తి పోషిస్తారు.  కీర్తనలు, తత్వాలు, థరాలు, మిత్రాలు, వచనాలు, శ్లోకాలు, దండకాలు, దరువులు, కందార్ధాలు అన్నీ అదేతీరు. అట్టి సహజనిసర్గతెలుగుకళాసంపదను ఏదోఒకభాగంలో సామ్యంచూసి పరధీనంచేసుకోవడం భావ్యంకాదు.  పూర్ఫకవులుచాలామంది తమ హరికధాకావ్యాలకు యక్షగానాలనిపేరుపెట్టడంకూడా ఇక్కడ గమనార్హం.
      "అంబరీ షొపాఖ్యానంబను యక్షగాన ప్రబంధంబునకం గధాక్రమం బెట్టిదనిన" అని చెవూరి ఎరుకయ్యదాసుగారు (1861-1941) తమ హరికధను యక్షగానమని వ్యవహరించారు.
  ** "దక్షిణడేశానికిచెందిననంతవరకూ హరికధలు మహారష్ట్రసంప్రదాయాన్ని అనుసరించె వచ్చాయని చెప్పవచ్చునేమొగాని, ఆంధ్రదేశానికి సంబంధించినంతవ్రకూ మాత్రము హరికధ యక్షగాన సంప్రదాయంలో నుంచే పరినమించింది".

  • డాక్టరు తూమాటి దొనప్ప "తెలుగు హరికధా సర్వస్వం ' పు.80
    • శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు. ఆంధ్రవాగ్గేయకారచరిత్ర పు.477