పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/284

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాలుక, కోరపళ్ళుపెట్టుకున్న రాక్షసిముఖం, పైనుండి క్రిందిదాకా నల్లటిఅంగీ, లోన ఎండుగడ్డితోకట్టిన బానపొట్ట, కుందలంతేసి స్తనాలు, మెడలో పుర్రెలదండ, కాళ్ళకు ఘనెల్ ఘనేల్ మనె గంతలమోత, ఒక చేతితోకత్తి, రెండవచెతిలో వేపరొట్టతో ముందు డప్పులు వాయిస్తంటే ఎగురుతూ రోడ్లవెంటభయంకరంగా వీరవిహారంచేస్తుంటే పిన్నలూపెద్దలూ బికాబికలై పారిపొతుంటారు.

  భేతాళవేషానికిమాత్రం మగచూపు, నాలుకకు మధ్యగాగానీ, బుగ్గకు మధ్యగగానీ చిన్న శూలం గుచ్చబదినట్లువుంటుంది.  నోటినుంది రక్తంకారుతున్నట్లు రంగుపూస్తారు.  చేతులకు త్రాల్లుకట్తి అటూయిటూ యిద్దరుపట్టుకొని అతని పరుగును ఆపుచేస్తుంటారు.  ఈ వెషంలో భీభత్సాన్ని విపరీతంగా సృష్టిస్తారు.
   ఇవి మిట్తమధ్యాహ్నం బయలుదేరతాయి.  పిల్లలు జడుసుకుంటారని ఈ వేషాలు వస్తుంటే పిల్లల్ని యిళ్ళల్లోనుంది బయటకు రానివ్వరు.  ఇందుకోసమే యీ వేషాలరోజున ఉదయమె గ్రామంలో దండోరాకూడా వేయిస్తారు.  ఈ భయానక  దృశ్యాన్ని ఊరూ వాడా పదిపదిహెను రొజులు దాకా చెపుకుంటూనెఉంటారు.  తలుపుసందుల్లోంచి చూసిన పిల్లలు జానపద కధలలో రాక్షసుల్ని చూసినట్టు అనుభూతిపొందుతూచెబుతుంటే చూడనిపీల్లలు చెవులురిక్కించి వింటుంటారు.
                               దే వ ర పి ట్టి
    ఇది మాంత్రికవేషం.  సాధారణంగా యిది ఆఖరివేషం అవుతుంది.  తలకు రంగుపాగా, బుగ్గ్తమీసాలూ, ఎర్రపంచి, చేతులకు సింహతలాటం మురుగులు, కాలికి గండపెండేరం, చెవులకు కుందలాలు, ముఖానికి పసుపు, నొసట పెద్ద గంగసింధూరంబొట్టు, ఒకచేతిలొ వేపరొట్ట, మరొచేతిలో ఎముక, కూడా యిద్దరు ముగ్గురు పరివారం గుమ్మం గుమ్మం దగ్గరా వేపరొట్ట దూసి తేళ్ళను సృష్టించడం, పొడి ఇసుక నీళ్ళలోవేసి మరల అందులోంచి పొడీఇసుక తీయడం, తడిబట్టలో జొన్నగింజలువేస్తే అందులోవేసి పేలాలు చెయ్యడం, నెలమీద కొబ్బరికాయ దానికదే నడవడం, ఒకరూపాయిని వందరూపాయలుగా చెయ్యడం, కొబ్బరి కురిడి నిలువుగా