పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/283

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అ ర్ధ నా రీ శ్వ ర

 కూచిపూడ్ పద్ధతిలో "శంభోసంకర సాంబసదాశివ - అంబర కేశదిగంబరరూపా" అని పాడుతూ భృంగి వేషంలో ఒకరూ అర్ధ నారీశ్వర వేషంలో ఒకరూ హార్మోనియం, మద్దెలా వాఇస్తూ మరిద్దరుభాగవతులూ కనీసంగా వస్తార్.  అర్ధనారీశ్వరవేషానికి కుడిచెంప శివుడుగాను, ఎడమచెంప పార్వతిగానూ ఒకే మనిషికి రెండు వేషాలూవేసి తలమధ్యనుంద్సి ముక్కు మీదనుండి పాదం వరకూ క్రిందకి ఒక తెర కడతారు.  శివుని వేషంవైపు పులిచర్మం, మడలో పాము, భుజానికి ఛేతులకూ రుద్రాక్ష మాలలు ముఖాన విభూతిబొట్టు, కంఠానికి నలుపుమచ్చ, మూతిపై మీసం, జటాజూటంపై గంగ ధరిస్తారు.  అప్పుడప్పుడు జాటాజూటంలోని గంగ గొట్టంలా పైకితన్ని ధారగా క్రింద పడుతుంటే విచిత్రంగా కనబడుతుంది.
    పార్వతివెషంవైపు ముక్కుకు ముక్కెర, ముఖాన్ కుంకుంబొట్టు, చీరకట్టు, రవిక, చేతికి గాజులు, భ్జకీర్తులు, తలకు స్త్రీ విగ్గు అలంకరిస్తారు.  శివుని పాత్ర అభినయించేటప్పుడు మధ్య తెరతొ పార్వతీవేషం మూసేస్తూ, పార్వతి పాత్ర ఫ్వచ్చినపుడు అదేవిధంగా శివునివైఉ కప్పేస్తూ నాట్యంలొ యీ మార్పు కనురెప్పపాటు కాలంలో చేస్తూ ప్రేక్షకుల నలరిస్తారు.
     ఈవేషంలో బహు బార్యాత్వమువలని చిక్కులూ గంగా గౌరీ సంవాదం (సవతులకయ్యం ) త్రిపురాసుర సంహారం, దక్షయజ్ఞం, దేవాసుర అమృత మధనం, పార్వ్ఫతీ పరిణయం, భళ్ళానరాజుకధ మొదలగు శివలీలలు అద్యాల రూపంలోనూ ప్రదర్శిస్తారు.  నడిరోడ్దుమీమీదే శివతాండవం ఏమాత్రం బెదురులేకుండా చేస్తారు.  పగటివెషాల్లో ఆదినుంచీ ప్రత్య్హ్?ఏకతగన్న వేషం యిది.  నవరసాలూ చోటుఛ్సుకునొన్న వేషం.
                   శ క్తి - భే తా ళ వే షా లు
   శక్తిభయానక రసానికి సంబధించిన వేషం.  కళ్ళకు కోడిగ్రుడు, నలుపురంగువేసిన విరబోసుకున్న జనపనార తల, బయంకరంగా చాపిన