పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/282

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సోజానా, ఏక్ నిరంజన్ - దో సుభీ - తీన్ గడ్ బిడ్ - చార్ లజ్ ఫట్ పాంచ్ మర్గయా" అని ఏదో వేదాంతం చెబుతున్నట్లు మారా ! యాసలో చెబుతుంటే ఆ చెప్పటంలోని తీరునుబట్టి తెలుగు ప్రజలు అదేదో వేదాంతంలా వినోదిస్తారు.

              "సి ద్ధీ - కం చె నీ" వే షా లు
   సిద్దీ తురక - ముకానికి నల్లని మసిపూసి, రెండంగుళాల గడ్డం, చొక్కాపై వేస్టుకోటు, చేతిలోకర్ర, టర్కీటోపీ, శిల్కు లుంగీ, బపూన్ లా వుంటాడు. కంచెనీ (బోగంవారు) నాట్యకత్తెలు ముగ్గురు నలుగురుంటారు.  వీరు జావళీలు, కృష్ణశబ్దం, మండూకశబ్దం, దశావతారాలు, అష్టపదులు, తరంగాలు, అధ్యాత్మిక రామాయణ కీర్తనలు, త్యాగరాయకృతులు పాడుతూ నాట్యంచేస్తూ చక్కగా అభినయిస్తారు.  వీరితోబాటు హార్మోనీ, మద్దెళ్ళతో భాగవతులుంటార్.
   సిద్ధీ అక్కడతాను పాదుషాగారి కాపలాదరుననీ అల్లరి చెయ్య వద్దని భాగవతుల్ని అదలిస్తాడు.  ఇతడు వారిలో గురుమూర్తిని గొర్రిమూతననీ, గోవిందప్పని గోండ్రుకప్పనీ, భరతనాట్యాన్ని బడితే నాట్యం అనీ పలకడం మనకు నవ్వు తెప్పిస్తుంది.  అమ్మాయిల్ని చూపించగానే ఆనందపడిపోయి ఆడమంటాడు.
     ఇక్కడ భాగవతుల నాట్యరీతులు, సిద్ధాంతాలూ, కర్తలు వగైరా ఎన్నో శాస్త్రవిషయాలు సామాన్యులకు తెలిసేటట్లు శ్లోకాలు చదివి అర్ధం వివరించి ఆహ్ ! అని శిష్టజనులుకూడా తల్లూపేలాచెప్పి మెప్పిస్తారు.  ఇందులో బాలగోపాలతరంగం దశావతారాలువంటివి నడివీదినే రంగస్థలంగా చేసికొని చక్కగా ముద్రలుపట్టి అభినయిస్తూ నర్తిస్తారు.
  అంతాచూసి సిద్దీ ఏమీ ఇవ్వడుసరికదా నవాబు దర్శనానికి కూడా అనుమతించడు.  అప్పుడు భాగవతులలో ఒకదు "తుమ్మచెట్టు తినే పళ్ళుకాయదు, పైగా తినేపళ్ళచెట్టు ఎవ్వరూ ఎక్కకుండా యీ తుమ్మకంచే కాపలా. అలాంటి తుమ్మచెట్టులాంటివాడివి నువ్వు" అని తిట్టడంలోని ఉపమ సాహిత్యకరులచేతకూడా శభాష్ అనిపిస్తుంది.  భాగవతుల నాట్యప్రవీణతనుప్రకటించేఅవకాశం యిందులోనే వుంది.  శృంగార, హాస్యరసాలకిది పట్టుగొమ్మ.