పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/262

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అని మంగళంలో ముగిస్తారు.
ఉషశ్రీ లాంటివాళ్ళు "స్వస్తి" అని ఒక్కమాటతో ముగిస్తున్నారు.

                        హ రి క ధ
     హరికధకూడా జానపద కళాస్వరూపమే.  హరికధకులు కాలికి గజ్జెలుకట్టి ఎగురుతూ, హావ భావాలు ప్రదర్శిస్తూ సంగీతంజోడించి కీర్తనలతోనూ, పద్యాలతోనూ, సంబాషణలతోనూ కధాకధనం సాగిస్తు మధ్య మధ్య పిట్టకధలతో హాస్యాన్ని గుప్పిస్తూ భారత, భాగవత రామాయణాల్లోని కధలకు ప్రాపంచిక విషయాలూ, అధ్యాత్మికవిషయాలూ జోడించి చెబుతూ పల్లెజనులనుఆకర్షిస్తూ మద్దెల, వయొలిన్, హార్మోనియంషకారులుగా నెలలతరబడికూడా చెబుతారు.
                    పగటి వేషాలు
      పగటివేషాలు సామాన్యంగా వేసేవి 32 వరకూ కనబడుతున్నాత్యి.  రోజుకోరకం చొప్పునవీరు పగలు వేషాలువేసుకొని ఊరిలో తిరుగుతుంటారు.  ఇందులో శక్తివేషం, మాంత్రికవేషం, లబాడీ వేషం, బోడెమ్మల వేషం ప్రసిద్ధి.  మాదిగవేషంలో కులాలపై హేతుబద్ధమైన విమర్శ, బోడెమ్మలవేషంలో సంఘపరమైన విమర్శ, శక్తివేషంలోని భీభత్సం ఒకసారి చూస్తే మరిజీవితంలో మరపురావు.  ఈ వేషాల్లోవీరు సంఘ దురాచారాలనూ, అత్యాచారాలనూ తూర్పారబడతారు.  గమ్మత్తుగా వానిని అవహేళన దేస్తు సమాజం దృఇష్టికి తీసుకువస్తుంటారు.
     నిజానికి ఒకనాడు మన పల్లెజనులకు విజ్ఞానాన్నందజేసినవి చాలా వరకు ఈ జానపద కళారూపాలే.  ఇప్పటికి ఆదరణలెకక్షీణదశకు చేరుకున్నాయి.  వీనిని ప్రజలూ, ప్రభుత్వం, ఆయా రంగాల కళాకారులు బాద్యత తీసుకోవాలి.  కనీసం మన సంస్కృతి చరిత్రకోసమన్నా వీనిని కెసెట్సులో భద్రపరచాలి.
                    కో తి ఆ ట
     వానరాలు నరులకు మూల రూపాలని డార్విన్ సిద్ధాంతం. వాని అవయవాలూ, ఆలోచనలూ మానవునికి దగ్గరగా ఉంటాయి  మాట