పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/261

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వంటి గోవిందబొబ్బలు కొట్టింఛడం, 'రామరామ రామసీత ' అని భజనలు కూడా చేయిస్తుండడంచేస్తారు. ఇందు శ్లోకాలూ పద్యాలూ దదివేరీతి ఒక ప్రత్యేక బాణీలో ఉంటుంది. అదొక చిత్రమైన చాయ. ఈ పురాణ కాలక్షేపాలు నెలల తరబడి సాగేవి. చివర అందరూ పురాణంశాస్త్రులు గారికి భక్తితో కట్నాలూ కానుకలూ చదివించేవారు.

పానుగంటివారు పురాణపఠనం గురించి ఇలా వ్రాసారు --

   "కొలదికాలము క్రిందట ప్రతిగ్రామమునందూ తామ భజనలు చేయు చాఫడిలోనో మఱ్ఱిచెట్టుక్రింద వేయబడిన మట్టి తిన్నె పైనో మునస్బు కరణముల రచ్చసాలలోనో రాత్రి ఎనిమిదిగంటల సమీపమున వృద్ధులు, బాలురు, పురుషులు, స్త్రీలు సావకాశముగా కొంతసేపు కూర్చుండి నిష్కల్మష హృదయాలతో నిశ్చల దీక్షతో పురాణం వినుచుండెడివారు.  పౌరాణికుడు గంభీరకంఠస్వరముతో నట్టి నిశ్చబ్ధసమయమున భారతమో, రామాయణమో, భాగవతమో బఠించుచుండగా కధాసందర్బములననుసరించి శిష్యులను భూషించువారు.  కృష్ణ, కృష్ణ అని తాత్కాలిక రక్తితో నరచువారలై ఒడలు తెలియని పవిత్రానుభబముతో నోలలాడుచుండెడివారు.
    "ఈ పురాణ శ్రవణము వ్లన ప్రజలలో భక్తిభావము పెంపొందుటే గాక పుణ్య కార్య్హములందు దీక్ష, సంతుష్టి, శాంతి, ధైర్యము, సత్కార్యాచరణలయందు మక్కువ వెల్లివిరిసేవి.  జాతి ఐక్యతకు ఇవి ఎంతగానో తోడ్పదేవి".

సాధారణంగా పురాణ కాలక్షేపం ప్రతిరోజూ లోకకళ్యాణం కోరుతూ యీ క్రింది శ్లోకంతో ముగుస్తుంది -

'స్వస్తి ప్రజాభ్యా: పరిపాలయంతాం
వ్యాయేన మార్గేణ మహిమహిశా
గోబ్రాహ్మణేభ్యశ్శుభమస్తు నిత్యా
లోకప్పమస్తాన్సుఖినోభవంతు '
కొందరు--

"మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
  చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం"