పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/260

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అలాగే వాజపయాజుల సుబ్రహ్మణ్య్హశాస్త్రి కూడా (రాజమహేంద్రవరం) అనర్గళమైనధారతో సరళసుందరంగా లౌకికవిషయాలను జోడించి అనేకచోట్ల పురాణప్రవచనంచేసి ప్రఖ్యాతిపొందారు. పిఠాపురం చింతామణిశాస్త్రిగారు కూడా యీకొవలోవారే. వీరి పురాణం అంటే జనం విరగబడిపొయేవారు. అద్భుతమైన జనాకర్షణ. ఆ చెప్పడంలోని సొగ్సు, పురాణాంతర్గత విషయాలచర్య పండిత పామరులందర్ని ప్రరవశుల్ని చేసేది వీరు పురాణం కాకినాడ, మండపేట వగైరా పట్టనాలలో నెలలతరబడి చెబుతుండేవారు.

          ఇక రేడియోలో వ్యాసపీఠంద్వారా వాసికెక్కినవారు ఉషశ్రీగారు.  వీరిగి రాజమండ్రి.  అసలుపేరు పురాణపండ సూర్య ప్రకాశదీక్షితులు.  వీరి ప్రఫచనం తీరు మరోరకం.  ఇది ఉపన్యాసధోరణి.  పైవారిలా నెలలతరబది ప్రవచనం చెయ్యడం కాకుండా అప్పుడప్పుడు అక్కడక్కడ రామాయణం, భారతాలలోని ఘట్టాలుచెబుతూ త్రన అమృత వాక్ప్రవాహంలో మనుషిల్ని మంత్రముగ్దుల్నిచేసేవారు.  వారి ప్రసంగం ఒకసారి వింటే ఎవరైనాసరే ఆయన అభిమానిగా మారిపోవలసిందే.  ఆగొంతు లోనిమాధుర్యం, ఆచెప్పడంలోని నేర్పు, ఆమాటలకూర్పు జనాకర్షణకు మూలకారణాలు.  వాల్మీకి రామాయణం, వ్యాసభారతం సామాన్యులకు అర్దమయ్యేలా సులభశైలిలొ ఆధునికంగా విశ్లేషిస్తూ చెప్పడం వీరి ప్రత్యేకత.
  గ్రామంలోని గుడి ఆవరణలో గాని, ఊరి చావిడొఇలోగాని ఎత్తైన బల్లమీద పురాణంశాస్త్రులుగారు కూర్చొని ఎదుట వ్యాసపీఠంమీద గ్రంధాన్ని వుంచి, అది చదివి వివసిస్తుంటారు.  కొంతమంది చదువుటకు నేరుగా మరొకరిని ఏర్పాటు చేసుకొని వారు చదువగా  వీరు దానిని సులభశైలిలో ఆశువుగా వివరిస్తుంటారు.  సధారణంగా వాల్మీకి రామాయణం,వ్యాస భారతం, దేవీ భాగవతం, కవిత్రయ బారతం, భాస్కర రామాయణం, గొపీనాధ రామాయణం, పోతన భాగవతం, భగవద్గీత శివపురాణం గ్రంధాలను ఈ ప్రవచనానికి ఎన్నుకుంటారు.  వానాకాలం వఛ్ఛిందంటే రాత్రులేగాక సాయంత్రం వేళల్లోకూడా గ్రామలలో పురాణాలు వినబడుతూనే ఉంటాయి.  జానపదులకు జ్ఞానభిక్ష పెట్టిన కళారూపాలలో దీని స్థానం గొప్పది.  ఈ ప్రపంచమ్లో మధ్యమధ్య ప్రేక్షకులను భాగస్వాములుగా చేయుటకు "శ్రీంద్రమారమణగోవిందో హరి"