పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/263

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రాకున్నా మనిషికి మచ్చికకాబడి అతనిమాటలు అర్ధంచేసుకుంటాయి. కూటికోసం కోటివిద్యలు అన్నట్లు కొందరుబిచ్చగాళ్ళు వీనిని మచ్చిక చేసుకొని వానికి తర్ఫీదు ఇస్తారు. ప్రదర్శనకు ఊరిలోనికి తీసుకువస్తారు. యజమాని ఆదేశం ప్రకారం అవి చేసేచేష్టలు జానపదులను చాలాబాదా ఆనందింపచేస్తాయి. అతడు కోతిని పొలంవెల్లి పశువూకాసుకురారా తిమ్మన్నాఅంటే అక్కడున్న పుల్లముక్క తీసుకొని ముదరకాళ్ళతో మెడమీదపెట్టుకొని, వెనుకకాళ్ళపైనడుస్తూవెళుతుంటే చిత్రంగాఉంటుంది. ఒరే తిమ్మన్నా ఈ బట్టలు మీ అత్తవారిచ్చారు క ట్టుకోరాఅని అని గుడ్డ ఇస్తే విసిరిపారేస్తుంది. ఈ బట్టలు మీ పుట్టింటివారుపంపారౌరా అంటే ఆ బట్ట ఆనందంగా భుజంమీద వేసుకుంటుంది. ఇలాంటి అనులేగాకుండా సర్కస్ ఫీట్సుకూడా చేస్తుంది. ఒక చిన్న ఇనుపచక్రంపట్టుకొని దానిలో నుంచి దూకమంటే చెంగునదూకుతుంది. ఆ చిన్న చక్రానికి నూనె గుడ్డలుచుట్టిమండిస్తూ దానిలోనుండి దూకమంటేకూడా నిర్భయంగా చెంగున దూరి బయటకువస్తుంది. తల క్రిందకుపెట్టి దిమ్మరమొగ్గలు వేస్తుంది. ఇది చూడడానికి మూగిన జనం పావలో, అర్ధో, బియ్యమో పెట్టి తమ కళాప్రియత్వాన్ని చాటుకుంటుంటారు.

                    ఎలుగు బంటాట
     కోతుల్లాగే ఎలుగుబంట్లనుకూడా మచ్చికచేసుకొని దానిచేత గంతులు వేయిస్తూ, చుట్టూచేరినవారికి సలాంచేయిస్తు ఆడించి జనాన్ని అలరించి డబ్బులు, బియ్యంప్రోగుచేసుకొని యీకళ జీవరాధారంగా బ్రతుకు తారు కొందరు.
              కాశీ పట్నం చూడరబాబు
      సినీమాలలేనిరోజుల్లో భూతద్ధంఎరిగినబుద్ధిమంతులు ఒకపెట్టిచేసి ఆ పెట్టెలో వెనుకభాగంలో పట్టణాలు, పర్ఫతాలు, నదులు, పుణ్యక్షేత్రాలు, దేవుళ్లు మొదలగు బొమ్మలు ఒకదానికొకటి గొలుసుకట్టుగా అంటించి, పెట్టెకు ఇరువైపులాగల ఊచలకు తగిలించి జరుపుతూ ముందు బాగంలో పెట్టకు మూడునాలుగు బొర్రెలు పెట్టి, ఆకంతల్లో భూతధ్దాలు అతికి లోపల