పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3

నాసికాత్రయంబకం దగ్గర పుట్టిన గోదావరి ఉరవళ్ళు పరవల్లతో కొండలూ, పర్వతాలూ, లోయలలో స్వేచ్చా విహారం చేస్తూ, మంజీరా, మానేరు, ప్రాణహిత, ఇంద్రావరి, శబరి వంటి చెలికత్తెలల్ జత కూడిజలకాలాడుతూ జలపాతాలూ, సెలయేళ్ళూ, నదీనదాలను దాటుకుంటూ తొమ్మిదివందల మైళ్ళు సుదూర్ యానంచేసి నిత్య యవ్వనంతో వయారాలొలికిస్తూ అందెల రవళులతో చిందులు వేస్తూ పరవశంతో సాగర ప్రియునిచేరే యీవడతిసోయగం అంతర్వేదివద్ధ ఒక మనోహర మధుర మంజుల సుందర్ దృశ్యం. ప్రజాశిల్పి కాటందొర క్రీ.శ.1852 ప్రాంతంలో ధవళేశ్వరుని సన్నిధిలో యీ నదీమతల్లికి ఆనకట్టకట్టి, ఆయ్హకట్టలేర్పరచి గోదావరి పరీవాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం ఛేశారు. ఆ స్వర్ణ భూమియే నేటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు. ఈ ఉభయ గోదావరి జిల్లాలను గోదావరి సీమగా పరిగణిస్తూ యీ పరిశోధన ఆ ప్రాంతానికి పరిమితం చేయడం జరిగింది.

అదిగో కొండలతో, కోనలతో, రాళ్ళతో, రప్పలతో కీకారణ్యంలావుండే యీప్రదేశం ధవళేశ్వర వారధితో దేశానికి గొప్ప ధాన్య్హాగారమయ్యింది. ఇక్కడ గోదావరి గౌతమి, వశిష్ట, వైనతేయ, దుల్య, ఆత్రేయ, భరద్వాజ, కౌశికి అనే ఏడుపాయలుగా విడి సప్తసాగరంగా పిలువబడుతూ ఇరుజిల్లాలను చుట్టుముట్టి పంటకరువూ, నీటి కరువూ లేకుండా బంగారు సీమ చేసి అన్నపూర్ణలా అందర్నీ ఆదుకుంటోంది. (కోపమొస్తే అది వేరే సంగరనుకోండి: అయినా అది తల్లికోపమే)

వేషంలో, భాషలో యిక్కడి ప్రజల తీరు సౌమ్యమైనది, ప్రసన్నమైనది. ఇక్కది ప్రకృతి సహజ సౌందర్యసుగుణాలరాశి. కళింగసీమలో "ఎల్లిపౌచ్చుండు" అంటే తెలంగాణాలో "వొచ్చిండు" అంటే, యిక్కడ "వచ్చాడు" అని వాడుక. అయినా

"వచ్చిందన్నా వచ్చాడాన్నా
వరాల తెలుగు ఓకటేనన్నా"

అనే సి.నా.రె. మాట అక్షర స్దత్యం.

ప్రజల్లో ప్రచార సాధనాలైన సినిమాలూ, పత్రికలూ గోదావరిసీమ భాషనే వాడుతున్నారు. గనుక యుదే ప్రామాణీక భాష అనడం సరికాదుగాని సర్వులకూ అర్ధమయ్యే నుడికారం యిందులో ఉంద్ని ఒప్పుకోక తప్పదు. శ్రీకాకుళం నుంచి