పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాయికారావుపేటవరకు వచ్చిన మాట తుని దగ్గర ఒక్కసారిగా మారిపోతుంది. రవికలేని చీరకట్టు, ముఖాన పెద్ద బొట్టు, చెవికి పోగులు, ముక్కుకాడవిడిచి రవిక తొదుక్కుని చీర సింగారించుకొని చిన్నబొట్టుతో చెవికి కమలాలు, ముక్కుపుడకలు ధరించి శారద్రాత్రి వెన్నెలలో ప్రవహించే గోదావరి మాతలా నిర్మలంగా సాగిపోతుంది ఏలూరువరకూ. ఏలూరు దాటిన దగ్గర నుంచి కృష్ణావాసుల నడికట్టు వేరు. మాటలో విసురు, వాడుక మాటల్లో భిన్నత్వం ఖచ్చితమైన వైవిధ్యాన్ని సూచిస్తాయి. గోదావరి జిల్లాల్లో ఉప్పట్టి అనే ఆటను యిక్కడ చెఱ్ఱాట అంటారు. ఆ పైన గుంటూరు వారిది కారంతీరు. ఇలాజిల్లా జిల్లాకు ఎంతోకొంత భిన్నత్వం కనిపిస్తుందిగాని ఉభయ గోదావరి జిల్లాలలో మాత్రం ఆటల్లో, పాటల్లో, మాటల్లో, చేష్టల్లో, వేషంలో భాషలో వీసమెత్తు తేడాకూడా కనిపించకుండడం విశేషం. ఏవో కొద్దిపాటి పట్టణాలు తప్ప యీ ప్రదేశమంతా పల్లెలమయమే. ఈ పట్టణాలుకూడా ఎక్కువభాగం పల్లె వాతావరణాన్నే ప్రస్పుటింపజేస్తాయి. ప్రస్తుత విషమైన జానపదకళలు, క్రీడలు, వేడుకలు విజ్ఞానతృకములు, వినోదాత్మకములు, ఆరోగ్య సందాయకములు, సంఘ శ్రేయ:కాములు. ఒకనాడు మూడు పువ్వులూ, ఆరుకాయలుగా జనజీవనంలో అంతర్బాగంగా అల్లుకుపోయి జ్వాజ్వల్యమానంగా వెలుగొందాయి. వీని విలువలు సమాఅజంమీద ఎన్నితరాలైనా తరగనివి చెరగనివి. అందుకే నేటి నాగరికులు వీనిని ఎంతొనక్కి నెట్టుతున్నా ఏదోలాగ బయటికొస్తూ వారికి తెలియకుండానే వారిలో కూడా ప్రవేశిస్తూ తమ ప్రతిభనూ ప్రజ్ఞనూ అవిచ్చిన్నంగా ప్రకటించుకుంటూనే ఉన్నాయి. దీనికి కారణం యీవిజ్ఞానం సమాజం మీదనేసుకున్న ప్రగాఢమైన ముద్ర. ఇది వ్డివడనిది, ముడివిడనిది.

                             =====