పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/241

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పదాలు, వెన్నెల పదాలు వగైరా జానపదగీతాలు పాడుతూ వానికనుగుణంగా పైకీక్రిందికీ ఎగురుతుంటే ఊరంతా ప్రతిధ్వనిస్తుంది. వలయం మధ్య అట్టటోపీలూ, చమ్కీ వస్త్రాలతో కొందరు దేవతాస్త్రీ పురుషవేషాలు వేసుకొని నృత్యంచేస్తూ పాట అందిస్తుంటారు. ఇది కూడా ఎంతసేపైనా చూస్తారు జనం. గొదావరిసీమలో మాలలు యీ ప్రదర్శన చేస్తారు.

                              తప్పెటగుళ్ళు
      ఇవికూడా అమ్మవారి జాతర్లలోనూ దేవుళ్ళ ఊరేగింపులోనూ పెడుతుంటారు.  ఈ కళాకారులను ఎక్కువగా కళింగసీమనుంచి రప్పిస్తుంటారు.  ఈ తప్పేట అనేది 'తాసా ' లాగుంటుంది.  ఇనూరేకుదొపలాగ మలచబడి పైన చర్మంతో కప్పబడి అంటించబడుతుంది.  లోన గుల్లగనక చేతివ్రేళ్లతొ వాయిస్తారు.  దీనికి 10, 15 మంది జట్టు ఉంటారు.  అందరూ తప్పెటలు తగిలించుకుని పాటాల లయకు అనుగుణంగా వానిని వాయిస్తుంటారు.  వీరు ఎర్రరంగుకలిగిన పొట్టిచేతుల జుబ్బాలూ, నిక్కర్లూ వేసుకుంటారు.  అవి వాయిస్తూ, పాడుతూ ఒక పద్దతిప్రకారం నృత్యం చేస్తారు.  వీరు యాదవకులస్థులు.  వీరిపాటలు, కధలు వైష్ణవపరంగా ఉంటాయి.  గొపాలకృష్ణుని రాసక్రీడలు, కృష్ణలీలల తాలూకుపాటలు ఎక్కువగా చోటుచేసుకుంటాయి.  గురువుముందుపాడుతూ నృత్యాభినయం చేస్తుంటే మిగిలినవారు తరువాతపాడుతూ అనుసరిస్తారు.  దీనిలోని ప్రత్యేకత వివిధ రీతులలొ తప్పెటలు వాయించడం, సర్కసుఫీట్సు లాగ ఒకరిభుజాలమీద ఒకరు, అతనిమీద యిద్దరూ యిలా ఎక్కి తప్పెట్లు వాయిస్తుండడం, బారచాపుకుకూర్చుని మోకాళ్ళమీద యిద్దర్ని కూర్చుండబెట్టుకుని తానులెవకుండా పడుకునే గిర్రుననాలుగువైపులా తిరుగుతూ తప్పెటవాయిస్తూ పాటపాడడం, పెద్దకుండపై ఒకడునిల్చుని, అతనిభుజంమీద మరొకడునిల్చుని, అతనితలమీద నీళ్ళపాత్రను పెట్టి అవికదలకుండాకూడా తప్పెటలు వాయించడంవంటి ప్రతిభాప్రదర్శనలు అద్భుతవిన్యాసాలు ఎన్నో ఉంటాయి. ఇందులో ముందుపాడే (గురువు)వారిగొంతు చాలాపెద్దదిగాఉండాలి.  కారణం, ఆచప్పుళ్ళ మోతలోకూడా అవి వినబడాలికదా!