పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/240

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఒకసారి 'విపుల ' పత్రికలో యీ బండ్లమీద వేషాలపై ఓక జోక్ పడించి. రాయగడ రైల్వేకాలనీలో దసరాసంబరం ఊరేగింపులో బండి మీద వేషాల్లో సీతారామాంజనేయ వేషాలు ఉన్నాయట. సీతారాముల పాదాలదగ్గర ఆంజనేయుడు కూర్చున్నాడు. సీతకు యూరినల్ కు అవసరంవచ్చింది. అర్జంటు, కదిలెతే ఆవేషం నిశ్చలతపోతుంది. ఏం చెయ్యాలి? కాస్సేపటికి ఆంజనేయుడు దభాల్ని బండిమీదనుండి ఉరికేశాడట సగంతడిసిన పంచెతో సీతను బండబూతులు తిడుతూ.

                             గ ర గా ట
        గంగాలమ్మ, నూకాలమ్మ, మరిడమ్మవంటి గ్రామదేవతల సంంబరాలకూ, జాతర్లకు గణాచార్యులు గరగలనెత్తుకొని డప్పులమోతకనుగుణంగా ఎగురుతుంటారు.  గరగ ఇత్తడికుండవలె ఉంటుంది.  దాని నెత్తిమీద పాముపడగ అమర్చబడివుంటుంది.  గరగలకు కోకలు కుచ్చిళ్ళతో కడతారు.  ఈ గణాచారులను ఆసాదులంటారు.  అంటే దేవతల పూజారులన్నమాట.  వీరు గోదావరిసీమలో ఊరూరా ఉన్నారు.
     వీరు శబ్ధానుగుణంగా ఎగురుతూ డప్పులు వడిగా వాయించేటప్పుడు పూనకంచేస్తారు.  దీనినే "గెనెక్కడం" అంటారు.  అప్పుడు వెంటనే ఇద్దరుమనుషులు పట్టుకొని మరొకరు కోడిపిల్లను నోటికి కరిపిస్తారు.  గెనెక్కినవ్యక్తి దాన్ని పటుక్కున కొరికేస్తాడు.  అమ్మవారికి కోడిపిల్లలు మొక్కుబదులు వస్తుంటాయి.  అవి చూడగానే పూనకం వస్తుంది.  అప్పుడు కొట్టే డప్పులదెబ్బలు వినేవాడిలోకూడా ఆవేశంతెస్తాయి.  ఈ సంబరాలనే జాగరాలంటూ తెల్లవార్లూచేస్తారు.  జనం చూస్తూనే ఉంటారు.
                           గా ర డీ లు
      ఉత్సవాలకూ, ఊరేగింపులకూ పల్లెలలో గారడీలు పెడతారు.  గారడీ అంటే మోళీ ఆటకాదు.  పర్వతాలవంటిపెద్ద డోళ్ళను కర్రలతో లయగా వాయిస్తూ వానిచుట్టూ వలయంగా పాతిక ముప్పయిమంది నిలబడి కాళ్ళకు ఎందుగడ్డిచుట్తుకొని ఆపైన ఇనుప అందెలు పెద్దపెద్దవి ఒక్కొక్కకాలికి రెండేసిజతలవంతున ఒకదానిమీదఓకటితొడిగి మొలకు గజ్జెలుకట్టుకొని "ఏలేఏల ఏలేయాల హైలెస్సో ఓహొ" అంటూ ఏలపాటలు, తుమ్మెద