పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/242

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కో య నృ త్యం

       సంబరాలలో కోయనృత్యం అని ఒకమేళం గిరిజననృత్యం చేస్తూంటారు.  ఈ మేళంలో దాదాపు ఇరవైమంది దాకా ఉంటారు.  సగంమంది మగవేషాలూ వేసుకొని తలకు కొమ్ములూ, మెడలో రంగురంగుల పూసలదండలూ, కోడి ఈకలూ, నెమలి పించాలూ ధరించి డోళ్ళు వాయిస్తూ నృత్యం చేస్తుంటే చూసే వాళ్ళకి తాము అడవుల్లోకి వెళ్ళి వాళ్ళనాట్యం చూస్తున్నట్లు భావన కలుగుతుంది.  అంత అచ్చుగుద్దినట్లు తయారై పాటాలుపాడుతూ, ఎదురుతూ, మధ్యమధ్య కోయభాషలా తెలుగువిరిచి మాట్లాడుతూ, కూతలూ అరుపులతొ ఒకరిఒకరు పిలుచుకుంటుంటే వాళ్ళు నిజంగా అడవినుంచి వచ్చిన కోయలేమో అనిపిస్తుంది.  అప్పుడప్పుడు వారు నోటినిండా కిరసనాయిలుపోసుకొని వెలుగుతున్న కాగడామీద ఊదుతుంటే ఆ కాగడానుంచి మంటలు బస్సుమని ముత్యాల్లారాలుతుంటే చూడ్డానికి అద్భుతంగా ఉంటుంది.
                             క ర్ర సా ము
   కర్రసాము కూడా ఉత్సవాల్లోనే పెడుతుంటారు.  'తాసా ' శబ్దానికి అనుగుణంగా అడుగులువేస్తూ సాము విద్యలో ఆరితేరిన ఇరువురు రెండు కర్రలు తీసుకొని, తమ చేతులతొ గిరగిరా త్రిప్పుతూ, ఒకరిపై ఒకరు కర్ర విసురుకుంటూ, దెబ్బకాచుకొంటూ,కర్రలను తాకిస్తూ ఎలడుగుమీద పల్టీవంటివానితో తమ నెర్పునూ, ప్రజ్ఞనూ, ప్రదర్శిస్తూ నేత్రానందం కలిగిస్తుంటారు.  దీనిని పల్లెటూళ్ళల్లో "సాధకం" అంటారు. ఉత్సాహవంతులైన పల్లెయువకులు ఈవిద్య నేర్చుకొని సంబరాల్లో ప్రదర్శిస్తుంటారు.  వీరముష్టివాళ్ళు  ఇది వృత్తిగా చేస్తారు కత్తులతోనూ కర్రలతోనూ.  ఆరితేరినవారు సాముగరిడీలు వివిధరీతుల్లో ప్రదర్శిస్తారు.

ఈసాముగరిడీలప్రస్తావన మనుచరిత్రలో యిలా వుంది--

"ఊరు సంధ్యాతవనశేణ మృత్కలితమై
  యొప్పారు బ్రహ్మాండమన్