పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/239

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పులివేషాలు

             జాతర్లలోనే పులివేషాలు కూడా పెడుతుంటారు.  ఇద్దరు ముగ్గురు నొంటి నిండా పసుపు, నలుపు పులిచారలు వేసికొని ముఖానికి పులితల (అట్టతొగాని, చెక్కతోగాని చేసింది) తగిలించుకొంటారు.  పులివేటగాడిలా ఒకవ్యక్తి కర్రపట్టుకుని మధ్యనుంటాడు.  తాసా మోత కనుగుణంగా వీళ్ళు అడుగులువేస్తూ మనిషిమీదకు లంఘించడానికి ప్రయత్నిస్తున్న పులుల్లాగ పులివేషధారులు, మాటుగాని వానిని చంపడానికి ప్రయత్నిస్తున్న మనిషిలాగ కర్రతొనున్న వ్య్హక్తి నటిస్తుంటారు.  ఒక్కోసారి అని అతనిమీదకు పంజావిసిరినట్టు, యిలా వేటక్రీడావిశేషాలన్నీ ప్రదర్శిస్తుంటారు.  జానపదులకు ఉత్సుకత కలిగించే కళలలో యిది ఒకతి.
         పీర్లసంబరాల రొజుల్లొ యిలా పులివేషాలతో కొంతమంది యింటింటికి తిరిగి యీ ఆట ప్రదర్శిస్తూ డబ్బులు దండుకుంటారు.
                      బండ్లమీద వేషాలు   
        పల్లెలలో దేవుళ్ళ ఉత్సవాలకూ దేవతల సంబరాలకూ  బండ్లమీద వేషాలు పెడతారు.  లక్ష్మి, విష్ణువు, గనపతి, పాందవులు, సీతారామలక్ష్మణులు, యమధర్మరాజు, పార్వతీప్రమేశ్వరులు మొదలైన వేషాలు  ప్రసిద్ధి.  వీనికి నిశ్చలత ప్రధానం.  సజీవప్రతిమవలెఉండడం ఇందులోముఖ్య్హం.  ఈవేషాలువెయ్యడానికి చదువు అక్కరలేదు.  సరిపడినరూపం కావాలంతే.  గ్రామాలలో చదువురానివారెందరికో నాటకాలలో వేషాలువెయ్యాలని సరదావుంటుంది.  వీనిద్వారా ఆ సరదాతీరుతుంది.  జనం యీ వేషాలకు ఎంతో ఆనందంగా చూస్తారు.  ఆదిలో ఊలవల్లినివాసి శ్రీ కాద వెంకన్న యీ వేషాలు మేకప్ లో మంచి ప్రసిద్ది గడించారు.  తరువాత యిప్పు

డు నాటకాలకు డ్రస్ సప్లయిచేసే కంపనీలన్నీ కూడా యీ పనిలోకి దిగాయి