పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/238

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొగ్గలువెయ్యడం, పరుగెడుతున్నగుర్రాలపై ఒకదానిమీదనుండి మరొకదానిమీదకు ఉరుకుతూ స్వరీచెయ్యడం మొదలైన ఫీట్సుతో జనాన్ని అద్భుతంగా ఆకట్తుకుంటారు.

                                 మల్లేలాట
        "మాయమ్మసత్తెం చూడండోయ్ మల్లేలోయ్ మల్లేలొ" అంటూ చెళ్ళుమనే లావుపాటి జనపనార కొరడాదెబ్బలు విసురుతూ, ముఖానికీ చెంపలకూ పసుపూ కుంకుమా పూసుకుని, కుచ్చెళ్ళు గలపరికిణీవంటిది కట్టుకొని, చెట్టువేరు దండకడియం మాదిరిగా చుట్టుకొని ఒక పురుషుడూ అమ్మవారి విగ్రహంవున్న పెట్టి నెత్తిమీదపెట్టుకొని, నడుముకు వీరణం కట్టుకొని, రెండువైపులా రెండు;ఉల్లలతో వాయిస్తూ ఒక స్త్రీ వస్తారు.  ఆ కొరడా విసురుతుంటే వచ్చే 'చల్ ' మనే పద్ద శబ్రానికి వీరణందెబ్బకీ మల్లేలపాటకి వీధిజనం  అంతా చోద్యంగా చూడడానికి చేరతారు.  అప్పుడు వీరు అమ్మవారి పెట్టి క్రిందికిదింపి ఆట ప్రారంభిస్తారు.  వీరు చూపేవి అక్కువగా అమ్మవారిమాయలు.  అమ్మవారి చేతులకు గాజులు వేసి తెరతీస్తారు.  ఒక నిమిషంపోయాక తెరతీసి చూస్తే ఆ గాజులుండవు.  ఈ విధంగానే పసుపు, కుంకుమ వగైరాలు మాయంచేస్తారు.  మామూలు గుడ్డలో వడ్లువేసి పేలాలుగా వేపుతారు.  ఈ రీతిని పల్లెజనాన్ని ఎంతగానో వినోదింపజేస్తారు.  వీరిని మల్లెకాపరవాళ్ళని పిలుస్తారు జానపదులు.
                ఎలుగుబంట్ల వేషాలు
   ఇవి ఎక్కువగా సంబరాల్లోనె కనిపిస్తాయి. ఇద్దరు రెండు ఎలుగుబంట్లుగా చెక్కతోచేసిన ఎలుగుబంటిముఖాలను తమముఖాలకు తగిలించుకొని, ఎలుగుబంటి వెంట్రుకలమాదిరి నలుపురంగువేసిన జనపనారపీచు చిక్కం ఒళ్ళంతాతొడుక్కుని "తాసా" అంటే మెడనుంది గుండెలమీదకు త్రాడుతొ వ్రేలాడదీసుకొని రెండుచేతులతోనూ రెండుపుల్లముక్కలతో వాయించేది.  ఇందులో శక్తివేషంకూడా వుంటుంది.  చెక్కతో చేయబడి రంగులు వేయబది, పెద్ద నాలుకచాసి చూపుతున్న శక్తిముఖం తగిలించుకొని, పెద్దపెద్ద స్థనాలు అమర్చుకొని, పైన నల్లాంగీ తొదుక్కుని, ఒకచేతిలో కత్తి,ఒకచేతిలో శూలం ధరించి ఈ ఎలుగుబంట్లతో సమంగా ఎగురుతూ చేరిన జనాన్ని అప్పుడప్పుడు అదలిస్తుంటారు.