పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/236

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అమ్మానన్నుకనకే బామ్మకోడికియ్యకే
చాపచుట్టమంటాడ - చంకనెట్టమంటాడు
ఇల్లెక్కమంటాడు - ఇద్దెలు చూపమంటాడు
గడెగ్కమంటాడ్ - గంతులెయ్యమంటాడు" అని.

దొమ్మరసానులుచేసే కసరత్తులు, గమ్మత్తులు, వాలుచూపులే యీ ఆటప్రత్యేకత. వీరు తూర్పుగోదావరిజిల్లాలోని పెద్దాపురం, రాజానగరంలలోనూ, పశ్చిమగోదావరిలో తాడేపల్లిగూడెం రైలుస్టేషనుదగ్గరగా ఉన్నారు.

                                  గంగిరెడ్లాట
         'అయ్యగారికి దణ్ణంపెట్టూ - డూడూ, డూడూ బసవన్నా ' అని గంగిరెద్దులతో పగలు ఆడుక్కొని రాత్రులు పేటల్లో ఆటకడతారుగంగిరెడ్లవాళ్లు. ఇందు 'రారాబసవన్నా ' అని పిలవగానే దూరానఉన్న గంగిరెద్దు ఉరకలేసుకుంటూ పరిగెత్తుకురావడంలాంటివి చూస్తే ఎంతబాగా తర్ఫీదిచ్చారో అని జనం ఆశ్చర్యపోతారు.  ఒక మనిషి నేలమీద వల్లకిలా పడుకొని గంగిరెద్దును తనమీదకుపిలవగా అది అతనిమీదకుఎక్కి ఒకకాలు అతనితలమీద, ఒకకాలు గుండెలమీద, రెందుకాళ్ళు పొట్టమీదపెట్టినిలువగా అంతబరువునూకూడా సునాయాసంగా మోసెయ్యడం, ఆ విధంగా ఎక్కినేద్దు ఊగుతూ గుండెమీద నాట్యంచేస్తుంటేకూడా అతను నిభాయించుకొని ఉండగలగడంవంటి సాహసకృత్యాలు వీరిఆటలో ఆశ్వర్యపరిచే విద్యలు.  తమ చెపుచేతల్లో అవినడవడానికి వానికి ముక్కుతాళ్ళుపోసి కోలతో ఆడిపిస్తూ ఆడిస్తారు.

ఈగంగిరెడ్లాటలు గురించి పల్నాటివెరచరిత్రలో యిలా స్పృశింపబడింది

"గంగిరెద్దుల వాడు కావరమణచి
  ముకుదాడు పొడిచిన పొతెద్దులట్లు"

గంగిరెడ్లకు రాముడు, లక్షణుడు అని పేర్లు పెడతారు. వారు రాముడూ 'రా ' అంటే పెద్దేద్దు పరుగెత్తుకు వస్తుంది. "లక్షమణుడూ ! రారా" అంటే చిన్న ఎద్దు వస్తుంది. చూసేవాళ్ళకిది చోద్య్హంగా ఉంటుంది.