పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/235

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నెట్టి మొగ్గలువేస్తుంటే అదేమిటిరా దొమ్మరిమొగ్గలు ! అంటుంటారు -- అదన్నమాట వీరి మొగ్గల పద్దతి. డోలుశభ్దాన్నిబట్టి వీరు మొగ్గలు బలే వడిగా వేస్తూ చూపరులను ఆనందింపచేస్తారు.

   వీరి ఆటలో ఆఖరి అంశం సాని గెడెక్కడం.  దాదాపు పాతిక అడుగుల పొడవుగల లావుపాటి బలమైన వెదురుగడ నిటారుగా నిలబెట్టి అది పడిపోకుండా నాలుగువైపులా గట్టిత్రాళ్ళతో కడతారు.  ఆ వెదురు కర్రచివర రెండంగుళాల ఇనుపఊచముక్కఉంటుంది.  వేపరొట్ట చుట్టబడి దానికి కొంచెందిగువలో ఒకచిన్న ఊయల కట్టబడి ఉంటుంది.  దొమ్మరసాని వెదురుబొంగు కనుపులదగ్గర కాలిబొటనవ్రేలితోనొక్కి వెడుతూ నిచ్చెన ఎక్కినట్లు పైకెక్కి అక్కడ ఉయ్యాలలొ ఊగుతూ దానిమీదకూడా మొగ్గలువేసి చూసి ఆ తరువాత పైనున్న వేపరొట్టతీసి క్రిందపడవేసి, ఆ ఇనుపఊచను బొడ్దులొవలకట్టుకున్న ఇనుపగిన్నకు తగిలించి, కాళ్ళూ చేతులూ బారచాపి, గాలిలో గిర్రునతిరుగుతుంటేఅ ప్రజ్ఞకు జనమంతా చప్పట్లుకొడుతూ వినోదిస్తారు.  సాని గెడెక్కితిరగడం గ్రామానికిశుబమని ఇప్పటికీ ముసలమ్మలు చెబుతుంటారు..
     ఈ దొమ్మరాటలు రెడ్డి, పద్మనాయకరాజులకాలంలోకూడా (15 వ శతాబ్దిలో) కలవు.  అంతేగాక యింకాముందుకుచూస్తే పండితారాధ్య చరిత్రలో యిలా వ్రాయబడింది.

            'అమరాంగనలు దివివాడెడు మాడ్కి
             సమరంగ గడలపై వాడెడువారు."

దీనినిబట్టి దీని ప్రాచీనత గమనించవచ్చును. చంద్రశేఖరశతకంలోవీరి
ప్రతిభను యిలా చెప్పేరు.

              'మొడ్డుగ దొమ్మరెక్కగన
              యించిన యిద్దమరేడలేదు నా
              తెడ్డొక బావ విద్దెలవి
              తిట్టును మూర్ఖుడు చంద్రశేకరా."

అంటే బ్రాహ్మణ విద్యలేవీ కూడా దొమ్మరి విద్యకు సరిరావట దీనిమీద ఒక పాటకూడా వుంది. అందులో యీఆటతీరు కన్నులకుకటినట్లుంది-