పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/237

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మో ళీ ఆ ట

                ఏదైనాఒకరోడ్దుపై డోలుకొడుతూ ఢమరుకంవాయిస్తూ ఉర్దూ యాసతొ తెలుగుమాటలువినబడుతూ జనం చుట్టూమూగిఉన్నారంటే అది ఖాయంగా మోళీ ఆటే.  ఇది సాహెబుల విద్య.  కాళీగా ఉన్న పాములబుట్ట చూపి అందులో ఒక కాగితంవేసి మూసి మరల మూత తీసేసరికి  అందులో కాగిరానికిబదులు పాముండడం, మనిషిని బుట్టలో పెట్టి మాయం చెయ్యడం, కాళీకుంచం పిల్లవానికాళ్ళస్ందునపెట్టి రూపోయలుకురిపించటం, ఉంగరాన్ని మాయంచేసి తిరిగితెప్పించడం వంటి అద్బుతాలు ప్రదర్శించి చేరినజనాన్నిసంభ్రమంలో ముంచెత్తుతారు.  ఇదంతా కనికట్టట.  వీరి ఉర్దూ తెలుగు మాటలూ బుల్ బుల్ మీద హిందీసినిమాపాటలూ మధ్యమధ్యపేల్చే జోక్సు మంచి తమాషాగా ఉంటాయి.  ఇదంతా కొత్తలంకయోగిమహత్యమనిచెప్పి ఆఖరున అతనిపేరుతో తావీదులు అమ్ముతుంటే జనం నిజమనేబ్రాంతితో కొనేస్తారు.  దీనినే గారడీవిద్య అని పిలుస్తారు.  కొరవిగొపరాజువ్రాసిన సింహాసన ద్వాత్రింశికలో దీనిప్రసక్తి ఉంది.
         ఇప్పుడిది "ఇంద్రజాలవిద్య" అని ధియేటర్లలో ప్రదర్శనలిస్తూ దేశప్రఖ్యాతిపొందురున్నారు.  సావర్కారు, పట్టాభిరాం వగైరాలు. ఈ రచయితకూడా యిలాగ ఎన్నో ప్రదర్శనలివ్వడం జరిగింది.
                        గు ర్రా లా ట
         గిరిజాలతలలు, చెవులకు పెద్దకమలాలు, సైకిల్ కట్టు పంచె, పైకి ఎగగట్టిన గోచీతో  క్షత్రియపుత్రులవలె గోచరించే ఏడెనిమిదిమంది 'యోధులు ' నాలుగైరు స్వారీ గుర్రాలతో ఊరిమధ్య ఆటసాగిస్తారు.  వీరు మొదట బలప్రదర్శనకు సంబందించిన అంశాలు ప్రదర్శిస్తారు.  ఒకని రెండుభుజాలమీదా ఇద్దరు నిలబడడం, ఆపైఇద్దరి భుజాలమీదా ముగ్గురునిలబడడం, రెండెడ్లబండిని జుట్టుకుకట్టుకొని ఒకరు లాక్కురావడం, బలమైన ఇనుప గొలుసులు త్రెంచడం, కట్టగాకట్టిన మూడు నాలుగు ఇనుపగునపాలను ఒక్కపెట్టునవంచడంవంటివి ఎన్నెన్నోచేసి ఆఖరికార్యక్రమంగా గుర్రాలమీద వేగంగా స్వారీచేస్తూ వానిపై