పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/228

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

స్త్రీలతిట్లు స్రీలవైతే -
             నీనోట్లో పురుగులు పడ
             నీ శవం కాటికెళ్ళ
             నీముఖం మండ
             నీనోరు పడిపోను
             నువ్వూడిపోను
             నువ్వరాలిపొను
              నీపెళ్ళాం రేవులోకెళ్ళ (పురుషులైతే)
             నీకు పెద్దరోగం రాను
             నీ జిమ్మడ
             నువ్వ్దు ముండామొయ్య
             నిన్నమ్మోరేసుకుపోను
             నీతాడు తెగ
             ముంద
             లంజ
             గుడిచేటిదాన (గుడి + చేటి = దేవదాసి)
             నీకు దిక్కులేనిచావు రాను.
            నీకాళ్ళూచేతులూ పడిపోను
చిన్న పిల్లల్నయితే --
            నిన్ను గోతిలో పెట్ట
            నీయమ్మ కడుపు కాల
పురుషులైతే --
            వెధవ, లంజకొడకా
            ఇవన్నీశాపనార్ధాల లాంటివి.
క క్రియాత్మక తిట్లు:- తీవ్రఆగ్రహంతొ ఫట్ ఫట్ మంటూ - పేలి
తుంటాయి యిలాగ - బుర్ర రామకీర్తన పాడించేస్తాను జాగ్రత్త.
(రామకీత్రన పాడించడమంటే గట్టిగా కొట్టడం అట). నిన్ను కోదండం ముంచకఫోతే నాపేరు ఫలానా కాదు. (కోదండం తీయించడమంటే తలకాయ దూలానికి వ్రేలాడదీయటమట)