పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/229

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తన్నేనంటే మళ్ళా నీదిక్కున్నకాడ చెప్పుకొవాలి.
సాసిపెట్టి లెంపకాయకొడితే మళ్లీ మంచినీళ్ళడగవు తెలుసా ?
మళ్ళీ మాటాడేవంటే చెంపాగిలిపొతుంది
మళ్ళీపేలితే పళ్లు రాలిపోతాయి జాగ్రత్త
నోరుముయ్యి
సమాధానంచెప్పేవో గూబ గుయ్య్ మంటుంది
కళ్లుపీకేస్తాను ఏవనుకుంటున్నవో
నిన్ను ముక్కలు ముక్కలుకింద నరికి పొగులుపెట్టేస్తాను
పళ్ళు రాలగొడతాను.
నిన్ను ముక్కలక్రిందనరికి కాకులికెగ్రద్దలకీ ఎగరేస్తాను
పీకపిసికి గోతిలోకప్పెట్టేస్తాను
వీపువిమానం మోతమొగిపొద్ది - జాగ్రత్త.

 ఒక వీధికుళాయివదగ్గర నీళ్ళుపట్టుకోవడంలో తగువొచ్చి బరి
తెగించి వేడివేడిగా వదులుతొన్న తిట్టులుచూసి ఓ సినీరచయిత గబగబా రాసేసుకుంటున్నాడట. అలావెళుతున్న ఒకాయన అదేంటయ్యా ఇది నేట్సినీమాలమీదజోకేఅయినా ఇది సినిమారంగం తిట్టు సాహిత్యానికిచ్చిన గౌరవాన్ని వ్యక్తంచేస్తుంది.

                           ఒట్లు
జానపదులు తమ సత్యసంధతనుతెలిపెరూపం ఒట్టు. చేతిలోచెయ్యేసి చెప్పేతిట్టు ఒకటి. నోటితోనెచెప్పే తిట్తొకతి, ఏదైనా ప్నిచేస్తాననిఒప్పుకోవడానికి చేతిలోచెయ్యేసి ఒట్టు అంటారు. అంటే ఇద్ వాగ్ధానపుఒట్టన్నమాట. "చేతిలోచెయ్యేసి చెప్పు మావ" ఇది గట్టిఒట్టు. ఇక రెండవది తానాచెడ్డపని చెయ్యలేదనిచెప్పడానికి నోటితో చెప్పే ఒట్టు.
                   తల్లికి తోడు
                   నాబిడ్దల మీదొట్టు
                   సత్యప్రమాణంపూర్తిగా ఒట్టు
                  నిన్ను చంపుకుతిన్నట్టు