పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/227

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సూర్యుడిమీద ఉమ్మిస్తే తనమీదే పడుతుంది
సిరిపోయి చీడ్ పట్టుకున్నట్టు
పత్రాలమొగుడు ఉత్తరాలేస్తే చింతాకుల్లో చిక్కడిపోయేయట
సమర్తకీడు చాకలిదాన్ని కొట్టేసినట్టు
సుబ్బమ్మపెళ్ళిలొ సూరమ్మమూర్తాలని
సంచిలాబం చిల్లుకూడ్చిందన్నట్టు
సరసుణ్ణినమ్ముకొని ఉన్నమొగుణ్ణి ఊడగొట్టుకుందట
సత్రంభోజనం మఠం నిద్ర
సముద్రంలొ కాకిరెట్ట
సర్రాజుపెళ్ళిలొ గుర్రాజుకోపోగు
సాతివారితో సరిగంగస్నానాలుచేస్తుంటే ముసలమొగుణ్ణి మొసలిలెత్తు
                                కెళ్ళిందట
సిరిఅబ్బదుగాని చీడ అబ్బుతుంది
సీతారామాఖ్యొనముమ: అంటే మాఃయింటాయన ఎదురుకాలెదా అన్నదట
హోరుగాలిలొదీపమెట్టి దేవుడా నీదేభారమన్నట్టు
హనుమంతుదిముందా కుప్పిగంతులు ?

                                 తి ట్లు

జానపదులు నిర్భయులు. తగువొచ్చిందంటే ముందువెనుకలాలోచించ
కుండా తిట్టేస్తారు. ఆవేశపూరితమైన మనిషికొపానికి వాగూపం తిట్టే.
ఆదికావ్యం తిట్టుతోనేకూడాప్రారంభమయిందీ

                   "మానిషాద ప్రతిష్ఠ్వాంత్వ మగమస్యశ్వతీసమా:
                     అత్కేంచమిధునాదేకమవధీ: కామమొహితమ్"
క్తొంచపక్షిజంటలో ఒకపక్షికొట్టిన బోయవాణ్ణిచూసి వాల్మీకి ఆగ్రహం పట్టలేక అప్రయత్నంగా తిట్టిన తిట్టిది, "ఓ బోయవాడా! నీవు వృద్దిని
పొందవు" అని. మహర్షితిట్టుకనుక మృదువుగావుంది. కాని జానపదుల తిట్టుకఠినంగానూ, ఒక్కొక్కప్పుడు కర్నకఠోరంగానూకూడా ఉంటాయి. ఆడవారైతే మరీను. వీధికుళాయిలదగ్గర సిగపట్లతో యీ తిట్లు ప్రవాహంలా సాగొపొతుంటాయి. ఆవేశం వేడెక్కెకొద్దీ బూరులుకూడా తోడవుతుంటాయి.