పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/224

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మంచిమనిషికోమాట మంచిగొడ్దుకోదెబ్బ
మంత్రాలకు చింతకాయలు రాలతాయా ?
మొగుడు చస్తేనేగాని ముండకు బిద్దిరాదు
మసిబూసి మారేడుకాయ చేసినట్టు
మాంసంతింటామని ముడుసులు మెళ్ళో కట్టుకు తిరుగుతారా ?
మాటకు మాట తెగులు, నీటికి నాచు తెగులు
మాటలు కోటలు దాటుతాయి కాళ్లు గడపదాటవు
మాటలు నేర్చిన కుక్క ఉస్కొ అంటే ఉస్కొ అందట
మిన్ను విరిగి మీద పడ్డట్టు
మాయింటికొస్తే ఏంతెస్తావ్, మీయింతికొస్తే ఏంపెడతావు అన్నట్టు
మేకవన్నె పులి
మంత్రసానిపనికొప్పుకున్నప్పుడు బిడ్దొచ్చినా పట్టలి, గొద్దొచ్చినా
                                     పట్టాలి
మంది ఎక్కువైతే మజ్జిగాల్చనౌతుంది.
మేకపెంటికి దొడ్లోఉన్నాఒకటే ముగ్లోఉన్నాఒకటే
మొదటిదానికి మొగుడులేడుగాని కడదానికి కళ్యాణమట
ముంజులుతిన్నవాణ్ణివదిలేసి మోరలుతిన్నవాణ్ణి పట్టుకున్నారట
మందిచేరితే ముఠానికిచేటు
మొక్కైవంగనిది మానైవంగుతుందా ?
మేసేవాడికి తెలుస్తుంది కావిడిబరువు
మింగడానికిమెతుకులేదుగాని మీదాలకిసంపంగనూనెట
మారాజా అని మనవిచెసుకుంటే మరొరెండుతగల్నియ్యమన్నాడట
మనిషి మచిదేగాని గుణం గుడిచేటిది
మీఇంట్లోభోంజేసి మాఇంట్లోచెయ్యికడుక్కొమన్నాడట
ముళ్ళకంచెలమీదఆరేసినబట్ట మెల్లిగాతీసుకోవాలి
ముందునడవమని వెనకాల కొంకులుకొట్టే రకం
ముల్లొచ్చి అరిటాకుమీదపడ్డా అరిటాకొచ్చి ముల్లుమీదపడ్డా అరిటాకుకే
                               నష్టం
ముసలాడికి దసరా పండుగని
మూడుమనువులెల్లినా పొయ్యూదటం తప్పలేదన్నట్టు