పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/225

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొగమాటానికిపోతే కడుపొచ్చిందట
మొగుడుచచ్చి మొత్తుకుంటుంటే మిండగాడొచ్చి మీదపడ్డాడట

యాదవకులంలో ముసలంపుట్టినట్టు
రమా అంటే బూతయిపొయింది
రాజులసొమ్ము రాళ్ళపాలు
జారునిచూచినకళ్ళతో మొగుణ్ణి చూస్తే మొత్తబుద్దేస్తుందట
రామాయణంఅంతావిని రాముడికి సీతేంమౌతుందన్నాడట
రామాయణంలో పిడకలవేట
రోగీపాలె కోరాడు, వైధ్యుడూ పాలె పత్యం చెప్పేడన్నట్టు
రొట్టెవిరిగి నేతిలోపడ్డట్టు
రొలెళ్ళి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు
రౌతుకొద్దీ గుర్రం
రౌతుమెత్తనైతే గుర్రం మూడుకాళ్ళతో నడుస్తుంది
రంకు సాగితే వెళ్ళెందుకురా పెదబాబూ అని
రంకునేర్చింది బొంకనేరదాఅని
రామెశ్వరంపోయినా శనేశ్వ్గరంతప్పలేదన్నట్టు
రాక్షసబొగ్గుల్లో రామచిలక
రజకచక్రవర్తీ అంటే అంతపెద్దపేరు మాకెందుకుదొరా ఆపేరు మీరే
               ఉందుకోండన్నాడట
రాజుగారికి ఎద్దకొడుకుగానైనాపుట్టాలి బోగందానికి తమ్ముడిగానైనా
               పుట్టాలి
రాముడిలాంటిరాజుంటే హనుమంతుడులాంటి బంటూఉంటాడు
రెందుచేతులా కలిస్తేనేగా చప్పట్లు
రొయ్యకులేదా తెగబారెడుమీసం?
లంకమేత గోదారిఈత
లంజని లంజా అంటే నూరుసార్లు లంజంటుంది. ఇల్లాలిని లంజాఅంటే
                       ఇల్లు దూరుతుంది