పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/226

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వానరాకడ ప్రాణం పొకడ తెలీదు
వంకలేనమ్మ డొంకట్టుకేడ్చిందట
వట్టిగొడ్డుకు అరుపులెక్కువ
విగ్రహౌష్ఠి నైవేద్యనష్ఠి
వడ్లగింజలో బియ్యపుగింజ
విత్తుముందా ? చెట్టుముందా ?
వినాయకుడిమీద బక్తా ? ఉండ్రాళ్ళమీద భక్తా ?
విస్సన్న చెప్పిందే వేదం
వెదకబోయినతీగ కాలికితగిలినట్టు
వెర్రివడిచేతిలో రాయిలాగ
వ్రతంచెడ్డా ఫలందక్కాలి
వండుకున్నవాడికంటె దండుకున్నవాడిపనే మెరుగు
వడ్డించేవాడు మనవాడైతే కడబంతిలోకూర్చున్నా ఫరవాలేదు
వెధముండయినా వేవిళ్ళుతప్పవు
వసుదేవుడు గాదిదకాళ్ళుపట్టుకున్నట్టు
విత్తొకటివేస్తే మొక్కొకటిమొలుస్తుందా ?
వెధముండకి దణ్ణంపెడితే నాలాగ నూరేళ్ళు బ్రకకమందట

శుబంపలకరా కంకెన్నాఅంటే పెలళ్ళికూతురు వెధవముండ అన్నాడట
శంఖంలోపోస్తేగాని తీర్ధంగానట్టు
శనగలుతిని చెయ్యికడుక్కున్నట్టు
శివుడాజ్ఞలేనిదే చీమైనాకుట్టదు
శతకోటిదరిద్రాలకు అనంతకోటిఉపాయాలు
శతకోటిలింగాల్లో ఈబోడిలింగమొకటి
సరదాకి సమర్తాదితే చాకల్ది కోకెత్తుకెళ్ళిందట
స్వర్గానికికెళ్ళినా సవతిపోదు తప్పనట్టు
స్వాతివానకు ముత్యపుచిప్పల్లాగ
సమయానికిలేనిబాకా చంనాకనా అనీ
సూదికోసం సొదికెలితే పాతరంకులు బయటపడ్డాయట
సన్యాసిపెళ్ళికి జుట్టుదగ్గరనుంచీ ఎరువే
సిగ్గులేనిమొకానికి వవ్వేసింగారమని