పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/223

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పెట్టనమ్మా పెట్టాపెట్టదు పెట్టేముండకేమొచ్చిందిరోగం అన్నాడట
పెద్దిందిరంక్,పెద్దచెరువుకలపు బయటకురావు
పేరుగొప్ప ఊరుదిబ్బ
పొమ్మనక్కర;లేదు పొగబెడితేచాలు
పొయినమగ సపొతేపోయేరు పొన్నకాయలాగుందుకుదిరిందందట
పొలీపోలీ నీ భోగమెన్నళ్ళేఅంటే మాలపల్లినుంచి మాఅత్తొచ్చె
                   వరకూ అందట
పరాయివాడితోలేచిపోతూ అత్తా నీకొడుక్కి చద్దన్నం అలవాటందట
పైనపటారం లోనలొటారం
బూదిదలొబొసిన పన్నీరులాగ
బురదగుంటలో పందిలాగ
బొడెద్దుకు పోట్లుమప్పినట్టు
బతకనిబిడ్డ బారెదు
బంగారపుపళ్లనికైనా గోడదాపుండాలి
బిడ్డతేగలాగున్నడంటే తేకతెమ్మనేడ్చేడట
బయటపులి, ఇంట్లో పిల్లి
బ్రహ్మచారిముదిరినా బెండకాయముదిరినా పనికిరారు
బాలనాయకం బహునాయకం
బ్రాహ్మణపాలెరుతనంచేస్తావా, పల్లకిఎక్కుతావా అంటే, పల్లకీ ఎక్కితే
    ఒళ్ళు కదులుతుంది బ్రాహ్మణపాలేరుతనమే చేస్తానన్నాడట
బెల్లం ఉన్నచొటే ఈగలుముసురుతాయి
భోగమదానివలపు, బొగ్గుతెలుపూ లేదు
భక్తిలెనిపూజ పత్రిచేటు
 మనబంగారం మంచిదైతే కంసాలిననవలసిన పనేమిటి ?
ముందు నుయ్యి వెనకగొయ్యి
ముందొచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి
మూలిగే నక్కమీద తాటికాయపడ్డట్టు
మెత్తనివాణ్ణిచూస్తే మొత్తబుద్ధేస్తుందట
మొండోడు రాజుకంటేబలవంతుడు
మొగుడుకొట్టినందుకుకాదు తోటికోడలు దెప్పినందుకేడ్చిదట
మోకాలికి బట్టతలకీ ముడేసినట్టు