పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/222

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పిండికొద్దీ రొట్టి
పుణ్యంకొద్దీపురుషుడూ దానంకొద్దీబిడ్డలూ
పుల్లయ్యేవారం యెల్లొచ్చినట్టు
పాతచింతకాయపచ్చడి పత్యానికి మంచిది
పండిన మలిసంవత్సరం కరువు
పట్టపగలుకొంగట్టుకుంటేరానిది చీకట్లోకన్నుకొడితే వస్తుందా?
పనసకాయదొరికినప్పుడే తద్దినంపెట్టమన్నారు
పుట్టలోపోసి పొట్టతడుముకుందట
పెళ్ళికెళుతూ పిల్లినిచంకనెత్తుకున్నట్టు
పేనుకి పెత్తనమిస్తే చేనంతా తెగకొరికిందట
పానక్ంలో పుడకలాగ
పుండొకచొటుంటే రచ్చొక చోటేసినట్టు
పుండుమీద కారం చల్లినట్లు
పుందుకి పుల్ల మొగుడు
పాపీ చిరాయువు
వెర్రివాడి పెళ్ళాం వాడకంత వదిన
పట్టుకున్నవాడు మట్టగుడసంటే పైనున్నవాడు బొమ్మెడాయన్నాడట
పారేసుకున్న చోటే వెతుక్కోవాలి
పిల్లిమెడలో గంటకట్టేదెవరా అని
ప్రజలసొమ్ముతొ పెద్దతిరపతెళ్ళినట్టు
పంచపాండవులంటే మంచంకోళ్ళలాముగ్గురని రెండేళ్ళుచూపించాడట
పడగచుట్టం, పాము పగానా ?
పదిమందిలోపడ్డపాము చావదు
పాండవులవారిసంపాదన దుర్యోధనులవరిపిండాళ్ళకుసరి
పాముకి పాలుపొసి పెంచినటు
పిచ్చికుదిరితేగానిపెళ్ళవదు పెళ్ళయితేగాని పిచ్చికుదరదు
పిడుక్కి వారసులా /
పిల్లిగుడ్డిదైతే ఎలకముడ్డిచూపించిందట
పులికడుపున పిల్లిపుడుతుందా ?
పులిమీద పుట్టలాగ
పెట్టకపోయినా పెట్టేఇల్లుచూపవమన్నారు