పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/221

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం లాగ
పొరుగూరువాడికి నీటిభయం, ఊళ్ళోవాడికి కాటిభయం
పల్లవంపు పొయ్యితీర్చినట్టు
అళ్ళున్నచెట్టుకే రాళ్ళ దెబ్బలు
పాముకి పంటిలో విషం, జాతికి కంటిలోవిషం
పొరుగింటి పుల్లకూర రుచి
పోరునష్టం, పొందులాభం
పండగనాడుకూడా పాతమొగుడేనా?
పనిలేనిమంగలి పిల్లితలగొరిగాడట
పరుగెత్తి పాలుతాగేకంటే నిలబడి నీళ్ళుతాగడం మేలు
పాడిందేపాడరా పాసిపళ్ళదాసరీ అని
పాలుతాగి రొమ్ముగుద్దినట్టు
పిచ్చికుదిరింది తలకి రోకలిచుట్టమన్నాడట
పెట్టపోరూ పిట్టపొరూ పిల్లెతీర్చిందన్నట్టు
పిడిక్కీ బియ్యానికి ఒకటేమంత్రం
పిల్లకాకికేంతెలుసు ఉండేలుదెబ్బ ?
పిల్లికళ్లుమూసుకొనిపాలుతాగుతూ తనని ఎవరూచూడ్డంలెదనుకున్నట్టు
పిల్లికిచెలగాటం ఎలక్కిప్రాణ సంకటం
పిల్లికి ఎలకసాక్ష్యం
పట్టుబట్టేరువిచ్చి పీటట్టుకు తిరిగినట్టు
పుట్టుకతోవచ్చినబుద్ధి పుడకలతోగాని పోదు
పుణ్యానికిపెడితే నీమొగుడుతో సమానంగా పెట్టమన్నాడట
పురిట్లోనే సంధికొట్టినట్టు
పులినిచూసి నక్క వాతలెట్టుకున్నట్టు
పువుల్లమ్మినచోట కట్టెలమ్మినట్టు
పెట్టినమ్మకు పుట్టిందేసాక్షి
ఎద్ద్తలకాయలేకపోతే ఎద్దుతలకాయ తెచ్చి పెట్టుకోమన్నారు.
పెద్దపులి పేరంటంపెట్టదు
పేదవాడికోపం పెదవికిచేటు
పొట్టోడికి పుట్టెడుబుద్దులు