పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/219

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తద్దినం కొనితెచ్చుకున్నట్టు
తన్నుతప్పించి ఆకాశమంతపెడుగుపదినా ఫరవాలెదన్నాడట
తల్లిగండమూకాదు, పిల్లగండమూకాదు, మధ్యన మంత్రసానిగండమన్నట్టు
తాడూలేదూ బొంగరంలేదు
తీతువుపిట్టకాళ్లు పైకెట్టి ఆకాశంపడకుండా ఆపుచేస్తున్నానందట
తేలొచ్చిందంటే వీధిలో మగవాళ్ళను పెలవ్వేఅన్నాడట
తొండముదిరి ఊసరవెల్లయినట్టు

దున్నపోతుమీద వానకురిసినట్టు
దంపినమ్మకి బొక్కిందేకూడు
దిందినగండం నూరేళ్ళయుస్షు
దీపముండగానే ఇల్లుచక్కబెట్టుకోవాలి
దున్నపోతుఈనిందంటే దూడను కట్టమన్నాడట
దూరపుకొండలు నునుపు
దేవుడువరమిచ్చినా పూజారివరమివ్వడు
దొంగని తేలుకుట్టినట్టు
దొంగలుబడ్డ ఆరుమాసాలకి కుక్కలుమొరిగినట్టు
దొడ్డెడు దూడలూ దొంగలెత్తుకుపోతే గొడ్దుగేదె శివాలచ్చిమయిందట
దరిద్రుడిపెళ్లికి వడగళ్ళవాన
దూదేకులవాడికి దూడతెగులు, లంజికి పిల్లతెగులు
దొరికితే దొంగ, దొరక్కపోతే దొర
దశకొద్దీదొరికాడు బిసకత్తులమొగుడని
దున్నేఎద్దునే పొడుస్తారు
దుబ్బుబారెడు, వెన్ను మూరెడు, దూస్తేదొసెడు, ఊత్తేఉళక్కి
దున్నపొతూ దున్నపోతూ పోట్లాడుకుని లేగదూడ కాళ్ళరగ్గొట్ట్ంట్టు
దొంగవచ్చేడండీ లేవండంటే ముక్కుకరుస్తాడే జాగ్రత్తాన్నాడట
దొంగతల్లికి ఏదవ భయం
దొంగలూదొంగలూ కలిసి ఊళ్లుపంచుకున్నట్టు

 నూరబద్ధాలడైనా ఒక పెళ్లి చెయ్యమన్నారు
నేతిబీరకాయలో నెయ్యిలాగ
నెలవిడిచి సాముచేసినట్టు