పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/220

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నోరుమంచిదైతే ఊరుమంచిదవుతుంది
నోరుంటే తలకాస్తుంది
నిజం నిలకడమీద తెలుస్తుంది
నక్కెక్కడా 1 నాగలోకమెక్కడ !
నలుగురితోపాటునారాయణా, కులంతోపాటు గోవిందా.
నల్లేరుమీద బండిలాగ
నవ్విననాపచేనే పండుతుంది
నవ్వేఆడదాన్నీ, ఏడ్చేమగనాణ్ణీ నమ్మకూడదంటారు
నవ్వు నాలుగువిధాల చేటు
నాకోడీ కుంపటీ లేకుంటే తెల్లవారదన్నట్టు
నానాటికీతీసికట్టు నాగంబొట్టూ అన్నట్టు
నిండుకుండ తొణకదు
నిజమాడితే నిష్ఠూరం
నిత్యంచచ్చేవాడికి ఏడ్చేవాడెవడని

నిద్రపొయేవాణ్ణిలేపగలంగాని దొంగనిద్రపోయేవాణ్ణి ఎవరులేపగలదు ?
నివురుగప్పిన నిప్పులాగ
నేలనుపొయేది నెత్తికిరాసుకున్నట్టు
నిండామునిగినొడికి చలేమిటి/
నొసటరసినరాత తుదిచినాపోదు
నక్కపుట్టినాలుగువారాలుకాలేదు, ఇంతగాలివాన నేనెప్పుడూచూళ్ళెదందట
నలుగురితోచావు పెళ్ళితోసమానం
నీట్లోగేదెనెట్టి బేరమాడినట్టు
నీతలమీద తేలుందంటే నీచేత్తోతీసెయ్యమన్నాడట
నేప్;ఉట్టకపోతే నీకు పెళ్ళామేలేకపోనంటే నువ్వుపుట్టకపోతే నీఅమ్మని
                  పెళ్ళాడుదునన్నాడట.
నోదున్నవాడిదే రాజ్యం

పనలెత్తుకుపోయినోణ్ణి వదిలేసి పరకేరుకునేవాణ్ణి పట్టుకున్నాడట
పాకపీకి పందిరేసినట్టు
పనోడుపందిరేస్తే పిచ్చికలు పడగొట్టేసేయట
పెడితేపెళ్ళి పెట్టకుంటే శ్రాద్ధ్జం