పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/202

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చిత్రించి వీరరసాత్మకంగా పాడేపాటలు ఎంతొ ఉద్రేక పూరితంగా ఉంటాయి యిలా-

"సై సై చెన్నా పారెడ్డీ, రెడ్డీ, రెడ్డీ,
నీపేరే బంగారపు కడ్డీ -
చెన్నప రెడ్డీ పేరు చెప్పితే
పసి పిల్లలే పాలు త్రాగరు
విరోధులంతావిలవిలతన్నుకు
చెట్టు పుట్టలా చేరెదరండీ
సై సై చెన్నాపా రెడ్డీ"

ఈ రగడలలోని వాడి, వేడి పాడే వాడినీ, వినే వాడినీ కూడా వుర్రూత లూగిస్తాయి. ఉద్యమాలకు ఊపునిస్తాయి. ఇంగ్లీషులోని Heroic Cauplets లాంటివి.

                      గే య పు రా ణ  గా ధ లు
      ఇవిగాక ఎన్నోపురాణగాధలు కధాగీతికలుగా వచ్చాయి. వీనిలో రామాయణపరంగా లంకాయాగం, ఊర్మిళా దేవి నిద్ర, సీతనామకరణం, సీతదేవి వేవిళ్లు, కుశలవుల కుచ్చల చరిత్రే, పుత్రకామేష్టి, లక్ష్మణదేవరనవ్వు,లక్షమణమూర్చ, సివపరంగా గౌరీసంవాదం ప్రసిద్ధి పొందాయి.  ఊర్మిళాదేవి నిద్రలోని 'శ్రీరామభూపాలుడు పట్టాభిషిక్తుడై కొలువుండగా ' అనేది స్త్రీలు కాలక్షేపానికి తరుచుగా పాడుతుంటారు.  త్రినాధ చరిత్రలోని 'హరిహారీ నారాయే ఆదినారాయ-కరుణించి మమ్మేలుకమలలోచనుడా ' అనే పాట సంక్రాంతి పండుగనాడు ఆబోత్ల్;ఉని బంతిపూల దండలతో అలంకరించి ఊరుత్రిప్పుతూ, పెద్ద బొంగురు చిప్పతాళాలు వాయిస్తూ పాడుతూ కొందరు గ్రామాల్లో ఇంటింటికీతిరిగి వడ్లు వసూలు చేసుకుంటూంటారు ఇప్పటికీ,'శ్రీరామా ...రామారా...మో రామా...రామయ్యా, హరిరామా...రామారా...మయివోధ్యా రామా ' అనేది కోలసంబరాల్లో వెంకన్నబాబుకధలో వినిపించే ప్రసిద్ధమైన వంతపాట.  గౌరీ కళ్యాణంలోని "ఘల్లు ఘల్లున సాద గజ్జెలందెలుమ్రోగ కలహంస నడకల కలికిఎక్కడికే, జడలోన గంగాను ధరియించుకొన్నట్టి జగమూలేలే సాంబా